హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు భారీ సంఖ్యలో రాకెట్లతో దాడి చేశారు. ఇజ్రాయెల్ వైపు నుంచి ప్రతీకార చర్య కూడా వచ్చింది. ప్రస్తుతం చాలా మంది భారతీయ పౌరులు ఇజ్రాయెల్‌లో ఉన్నారు.
Canada: కెనడాను సంక్షోభం భయపెడుతుంది. అంతా అనుకున్నట్లు ఇది భారత్-కెనడాల మధ్య దౌత్యవివాదం మాత్రం కాదు. ఇప్పుడు ఆ దేశాన్ని ‘గృహ సంక్షోభం’ భయపెడుతోంది. జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై పలువురు ఎంపీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రూడో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న న్యూ డెమోక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ కూడా
France: భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. 2030 నాటికి 30,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ ని ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఇటీవల ప్రధాని మోడీ ఫ్రాన్స్ సందర్శించారు. ఈ సమయంలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇది జరిగిన నెల తర్వాత మక్రాన్ ఈ ప్రకటన చేశారు.
700 మంది భారతీయ విద్యార్థులు కెనడా నుంచి బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల వీసాలు నకిలీవని గుర్తించడంతో దేశంలోని అధికారులు వారిని దేశం నుంచి బహిష్కరణ వేటు వేశారు.
కెనడాలోని భారతీయ పౌరులను, ఆ దేశానికి వెళ్లే విద్యార్థులను జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. కెనడాలో ఇటీవల భారతీయుల పట్ల నేరాలు పెరిగాయని.. విద్వేష దాడి ఘటనలు కూడా ఎక్కువయ్యాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితి ఇంకా కొనసాగుతోంది. మరోవైపు యుద్ధంలో దెబ్బతిన్న సుమీ నగరంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులందరూ విడుదలయ్యారు. ఇంతకుముందు సుమీలో చిక్కుకున్న చాలా మంది భారతీయ విద్యార్థులు తమ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో భారతీయ విద్యార్థుల పట్ల జాతి వివక్ష చూపిస్తున్నారని, స్థానిక దుకాణాలలో జాత్యహంకారాన్ని కూడా ఎదుర్కొన్నామని ఓ విద్యార్థి తెలిపాడు. ఈ విషయంపై బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వివిధ దేశాల విద్యార్ధులు, పౌరులు నానా యాతన అనుభవిస్తున్నారు. ఆపరేషన్ గంగా కార్యక్రమం ద్వారా యుద్ధ ప్రాతిపదికన వేలాదిమందిని భారత్ స్వదేశాలకు తరలించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారిని స్వస్థలాలకు పంపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్ లోని సుమీ లో చిక్కుకుపోయున భారతీయ విద్యార్థుల తరలింపు సాధ్యంకాలేదని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి చెప్పింది భారత్. ఇప్పటికి 20 వేల మంది భారతీయులను, భారత్ ను కోరిన ఇతర దేశస్థులను కూడా తరలించామని యు.ఎన్…
ఉక్రెయిన్ -రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ వేలాదిమంది భారతీయులు చిక్కుకుని పోయారు. ఆపరేషన్ గంగ ద్వారా కేంద్ర విదేశాంగ శాఖ యుద్ధ ప్రాతిపదికన విద్యార్ధుల్ని తరలిస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విద్యార్ధుల తరలింపుపై కీలక ప్రకటన చేశారు. రొమేనియా నుంచి 31 విమానాల్లో 6680 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తరలించామన్నారు. పోలెండ్ నుంచి 13 విమానాల్లో 2822 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తరలించారు. హంగేరి నుంచి 26 విమానాల్లో…
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగాను మరింత వేగవంతం చేసింది. ఇవాళ ఒక్కరోజే 8 వేల మందిని తరలించినట్లు కేంద్రం తెలిపింది. చివరి 24 గంటల్లో 18 విమానాల్లో 8 వేల మందిని భారత్‌కు తీసుకొచ్చినట్లు వెల్లడించింది. మరో 24 గంటల్లో 16 ప్రత్యేక విమానాలను ఏర్పాటుచేసి భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ విమానాల్లోనే 10 వేల 344 మందిని భారత్‌కు తరలించినట్లు…