ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసలు, టారిఫ్స్ వంటి వాటిపై షాకింగ్ డెసిషన్స్ తీసుకుంటూ ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నారు. ఇప్పుడు విదేశీ విద్యా్ర్థులపై ఆంక్షలకు తెరలేపారు. అమెరికాకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలనే కాంక్ష ఉన్నవారికి బిగ్ షాక్ తగిలినట్లే. ట్రంప్ ప్రభుత్వం తొమ్మిది విశ్వవిద్యాలయాలకు ఒక మెమో పంపింది. అవి సమాఖ్య నిధులను కొనసాగించాలనుకుంటే కఠినమైన కొత్త షరతులను పాటించాలని కోరింది. ఈ విశ్వవిద్యాలయాలలో భారతీయ విద్యార్థులతో సహా అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై…
US Visa Policy: అగ్రరాజ్యం అమెరికాలో తాజా వీసా ప్రతిపాదన భారతీయ విద్యార్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న స్థిరమైన డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ (Duration of Status) విధానాన్ని రద్దు చేసి, ప్రతీ స్టూడెంట్ వీసాకు స్పష్టమైన గడువును విధించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెడీ అయ్యాడు.
ఇజ్రాయెల్ -ఇరాన్ ఘర్షణ సంక్లిష్ట రూపం దాల్చిన నేపథ్యంలో.. అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి ‘ఆపరేషన్ సింధు’ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్ నుంచి 10 మంది ఏపీ విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి వచ్చే బాధితుల కోసం విదేశాంగశాఖ ఢిల్లీలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి వచ్చే బాధితుల కోసం ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్‌లలో రెండు…
Indian Students: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా, వలసలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరిణామాలు భారతీయ విద్యార్థులకు, ఉద్యోగులకు ప్రతిబంధకంగా మారాయి. తాజాగా, ఇండియన్ స్టూడెంట్స్‌కి షాకిచ్చే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘‘ క్లాసులకు హాజరు కాకుంటే వీసా రద్దు చేయవచ్చు’’ అని భారత విద్యార్థులకు అమెురికా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. Read Also: CPI Ramakrishna: పాక్‌తోనే చర్చలు జరిపి…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి సంవత్సరం విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా వెళ్తుంటారు. ఉన్నత చదువులు చదివి అక్కడే ఉద్యోం సంపాదించి డాలర్లు సంపాదించాలని కలలుకంటుంటారు. అయితే కొంతమంది విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకోకుండానే అసువులు బాస్తున్నారు. వివిధ కారణాలతో విద్యార్థులు మృత్యువాత పడుతున్నారు. దుండగుల కాల్పుల్లో కొందరు, రోడ్డు ప్రమాదాలు, వ్యక్తిగత కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ లో తెలుగు విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తుమ్మేటి సాయికుమార్ రెడ్డి ఉరేసుకొని ఆత్మహత్య…
హెచ్-1బీ వీసాదారులైన భారతీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ఉపశమనం ప్రకటించారు. NYT ప్రకారం.. ఈ వీసాలు నిలిపివేయబడవని ట్రంప్ అన్నారు. అమెరికాకు ప్రతిభ కావాలని.. తమకు ఇంజనీర్లు మాత్రమే అవసరమని ట్రంప్ పేర్కొన్నట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది. H-1బీపై జరుగుతున్న చర్చ గురించి ట్రంప్‌ను ప్రశ్నించగా.. "నేను అనుకూల, ప్రతికూల వాదనలతో ఏకీభవిస్తున్నాను. ప్రస్తుతం అమెరికాకు అవసరమైన ప్రతిభను ఈ వీసా ప్రోగ్రామ్ ద్వారా మాత్రమే కనుగొనవచ్చు. ఈ వీసాలు నిలిపి వేయం."…
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వారంలోనే ఆయన చేసిన ప్రకటనతో అమెరికాలో నివసిస్తున్న వలసదారులలో భయాందోళనలు నెలకొన్నాయి. అమెరికాలోని చాలా మంది భారతీయ విద్యార్థులు కళాశాల సమయం ముగిసిన తర్వాత పార్ట్ టైమ్ పని చేస్తూ డబ్బు సంపాదించేవారు. ఇప్పుడు వారు తమ పనిని వదిలివేశారు. ఓ జాతీయ మీడియాతో అక్కడున్న కొందరు విద్యార్థులు మాట్లాడారు. ఈ విద్యార్థులలో కొందరు, యూఎస్‌లో మనుగడ సాగించడానికి…
Canada Student Visa: కెనడా వెళ్లి చదువుకోవాలనుకోవడం భారతీయ విద్యార్థుల్లో చాలా మందికి ఉంటుంది. ఇన్నాళ్లు ఆ దేశ ప్రభుత్వం కూడా భారత్‌తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థులను ఆహ్వానిస్తూ వచ్చింది. అయితే, ప్రస్తుతం ఆ దేశ ప్రభుత్వం కెనడా వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులకు షాక్ ఇచ్చింది. కెనడా స్టూడెంట్ వీసా స్కీమ్‌ని నిలిపేసింది. కెనడా ప్రస్తుతం హౌసింగ్ సంక్షోభంతో పాటు వనరుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇబ్బడిముబ్బడిగా ఆ దేశంలోకి వలసలు పెరిగిపోతున్నాయని అక్కడి…
US Embassy: అమెరికా వెళ్లాలని అనుకునే భారతీయులకు అగ్రరాజ్యం మరో గుడ్ న్యూస్ చెప్పింది. అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్మెంట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది.
విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు ఆందోళన కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రకారం.. గత ఐదేళ్లలో 41 దేశాల్లో కనీసం 633 మంది భారతీయ విద్యార్థులు మరణించారు.