ఉక్రెయిన్ లో చిక్కుకుని పోయిన భారతీయ విద్యార్ధులకు ఊరట లభిస్తోంది. మోడీ ప్రభుత్వం వివిధ దేశాలతో దౌత్యసంబంధాలు నెరపింది. దీంతో భారతీయ విద్యార్థులకు పోలాండ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎలాంటి వీసా లేకుండా భారతీయ విద్యార్థులను తమ దేశంలోకి అనుమతిస్తామని పోలాండ్ ప్రకటించింది. ఉక్రెయిన్ నుంచి వచ్చే విద్యార్థులకు తమ దేశంలో ఆశ్రయం కల్పిస్తామని తెలిపింది. ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ నుంచి తప్పించుకున్న భారతీయ విద్యార్థులను ఎలాంటి వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించే అవకాశం కలిగింది. పోలాండ్ రాయబారి ఆడమ్ బురకోవ్స్కీ తెలిపారు.