Ukrain Tension:భారతీయ విద్యార్ధులకు సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ – రష్యా ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్ లో విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్ధులకు కేంద్రం పలు సూచనలు చేసింది. తాజా పరిణామాలతో ఉక్రెయిన్ లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న వందలాది మంది తెలుగు విద్యార్ధులు. తల్లితండ్రులు ఆందోళనలో వున్నారు. ఉక్రెయిన్‌లో ఉండాల్సిన అవసరం లేని భారతీయ విద్యార్ధులు స్వదేశానికి తిరిగి రావాలని కేంద్రం సలహా ఇచ్చింది.
ఉక్రెయిన్ లోని భారతీయ విద్యార్ధులు భారత్ దౌత్యకార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. ఉక్రెయిన్ లోని భారత దౌత్యకార్యాలయం అన్ని సేవలు అందించేందుకు పని చేస్తూనే ఉంటుందని కేంద్ర విదేశాంగ పేర్కొంది. ఇదిలా వుంటే రష్యా, ఉక్రెయిన్ మధ్య 30 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం ముదిరి పాకానపడింది. వైరం యుద్ధం అంచులకు చేరింది.ఉక్రెయిన్‌పై ముప్పేట దాడికి రష్యా రెడీ అయిందనే వార్తలు కలవరం కలిగిస్తున్నాయి.
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
రష్యా ఇప్పటికే లక్షన్నర మంది సైనికులను సరిహద్దుల్లో మోహరించింది. రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతగా ఫలితం మాత్రం కనిపించడంలేదని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. ఫిబ్రవరి 16 నే దాడికి రష్యా ముహూర్తం ఖరారు చేసిందని అమెరికా ప్రకటించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఉక్రెయిన్ పై దాడికి దిగితే తీవ్ర పరిణామాలు తప్పవంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉన్నత విద్యను అభ్యసించే భారతీయ విద్యార్ధులు అప్రమత్తంగా వుండాలని మనదేశం కోరుతోంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!