Canada: కెనడాను భయపెడుతున్న ‘గృహ సంక్షోభం’.. అంతర్జాతీయ విద్యార్థులపై పరిమితి.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: కెనడాను సంక్షోభం భయపెడుతుంది. అంతా అనుకున్నట్లు ఇది భారత్-కెనడాల మధ్య దౌత్యవివాదం మాత్రం కాదు. ఇప్పుడు ఆ దేశాన్ని ‘గృహ సంక్షోభం’ భయపెడుతోంది. జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై పలువురు ఎంపీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రూడో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న న్యూ డెమోక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ కూడా విమర్మలకు దిగారు. ట్రూడో 2025 వరకు కెనడా ప్రధానిగా ట్రూడో ఉండాలంటే జగ్మీత్ సింగ్ మద్దతు తప్పనిసరి.
వలసదారులను స్వాగతించే దేశంగా పేరున్న కెనడా.. ఈ హౌసింగ్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ విద్యార్థులపై పరిమితి విధించాలని యోచిస్తోందంటే అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి కెనడా వైశాల్యపరంగా చూస్తే రష్యా తరువాత ప్రపంచంలో అతిపెద్ద దేశం, కానీ జనాభా మాత్రం 3.87 కోట్లు మాత్రమే. చదరపు కిలోమీటర్ కి కేవలం 4 మంది మాత్రమే ఉంటున్నారు. ఇండియాలో జనసాంద్రత 481గా ఉంది.
Also Read
- Iran: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. కవల సోదరీమణుల్లో ఒకరికి మరణశిక్ష మరొకరికి 27 ఏళ్ల జైలు!
- Netanyahu: యూఎన్‌లో నెతన్యాహు ప్రసంగిస్తుండగా షాకింగ్ సీన్.. ఇరాన్ ఏం చేసిందంటే..!
- China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
- Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
సంక్షోభానికి కారణాలు ఇవే..
కెనడాలో గృహ సంక్షోభానికి ప్రభుత్వం తగినన్ని ఇళ్లు నిర్మించకపోవడం కారణమని ఆ దేశ ఎంపీలు విమర్శిస్తున్నారు. కెనడా జనాభాలో 87 శాతం మంది 10 ప్రావిన్సుల్లో మాత్రమే స్థిరపడ్డారు. కెనడా దక్షిణ భాగంలో అమెరికా సరిహద్దును ఆనుకుని కేవలం 160 కిలోమీటర్ల లోపే 90 శాతం మంది నివసిస్తున్నారు. మిగతా భూభాగం మంచుతో కప్పబడి, ఆర్కిటిక్ సర్కిల్ కి దగ్గరగా ఉండటంతో ఆ ప్రాంతంలో జనాభా చాలా చాలా తక్కువ. కెనడాలో ఇళ్ల నిర్మాణాలు జరగకపోవడంతో సంక్షోభం పతాక స్థాయికి చేరింది.
ఈ సంక్షోభంపై కెనడా ప్రతిపక్ష నేత పియరీ పోయిలీవ్రే కూడా ట్రూడోపై తీవ్ర విమర్శలు చేశారు. కెనడాలో ఇళ్లను సరసమైనవిగా చేస్తానని హామీ ఇచ్చిన 8 ఏళ్ల తరువాత ఖర్చును రెట్టింపు చేశారని ఆరోపించాడు. అద్దె, ఇళ్లకు డౌన్ పేమెంట్, మార్టిగేజ్ పేమెంట్ డబుల్ చేశాడని అన్నారు. కెనడా 1972లో కన్నా 2022లోనే తక్కువ ఇళ్లను నిర్మించిందని ఆరోపించారు. 2023లో ఇది 32 శాతం తగ్గుతాయని ఆయన అన్నారు.
Read Also: India-Canada: కెనడా రాకుండా పన్నూని నిషేధించాలి.. ప్రభుత్వాన్ని కోరిన హిందూ సంస్థ
వలసలెక్కువ.. ఇళ్లు తక్కువ..
కెనడాలో గృహ సంక్షోభానికి అంతర్జాతీయ విద్యార్థులు కారణం కాదని, ట్రూడో ప్రభుత్వమే కారణమని జగ్మీత్ సింగ్ అన్నారు. ఈ ఏడాది కెనడా 9 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉంది. ఇలా కెనడాకు వస్తున్న వారిలో భారతీయ విద్యార్థులే ఉన్నారు. 2022లో 5.5 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు వస్తే ఇందులో 2.26 లక్షలు అంటే 40 శాతం మంది భారత్ కి చెందిన వారే. అయితే వలసలు ఎక్కువగా ఉన్నాయి, కానీ అందుకు తగ్గట్లుగా ఇళ్ల నిర్మాణాలు లేవు. చాలా మంది నిరాశ్రయులు వీధుల్లో గుడారాల్లో జీవిస్తున్నారు.
ప్రైవేట్ విద్యాసంస్థలు భారతీయ విద్యార్థుల్ని డబ్బులు తెచ్చే వారిగా చూస్తున్నారు, కెనడియన్ల నుంచి వసూలు చేసేదాని కన్నా మూడు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారు, ఈ కాలేజీలకు హాస్టల్ సౌకర్యాలు కూడా లేవు. 2022లో కెనడాలో 8 లక్షల కంటే ఎక్కువ విదేశీ విద్యార్థులు హౌసింగ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Iran: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. కవల సోదరీమణుల్లో ఒకరికి మరణశిక్ష మరొకరికి 27 ఏళ్ల జైలు!
-
The Paradise-Nani: ట్రోల్స్‌ను బాగా ఎంజాయ్ చేశా.. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. నాని పోస్ట్ వైరల్!
-
Netanyahu: యూఎన్‌లో నెతన్యాహు ప్రసంగిస్తుండగా షాకింగ్ సీన్.. ఇరాన్ ఏం చేసిందంటే..!
-
Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
-
POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!