తెలంగాణలో మునుగోడు ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ నేతలు బీజేపీ పై మాటల దాడిని పెంచారు. తాజాగా మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలపై ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే ప్రధాన కారణం అని ఆరోపించారు. విఫల నోట్ల రద్దు నిర్ణయానికి రేపటికి ఆరు సంవత్సరాలు పూర్తి అవుతోంది. నోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసిందన్నారు కేటీఆర్. నోట్లను రద్దు చేసిన తర్వాత కొత్తగా మరో 12.91లక్షల కోట్ల నగదు చలామణిలోకి వచ్చిందన్నారు.
Read Also: టీ20 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్‌లలో ఆధిపత్యం ఎవరిది?
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్ధాయిలో 30.88 లక్షల కోట్లకు నగదు చలామణి పెరిగింది. నల్లధనం వెలికి తీయడం, నకిలీ కరెన్సీని అరికట్టడం, తీవ్రవాదానికి నిధులు ఆపడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసమే నోట్ల రద్దు అంటూ బిజెపి ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ అవాస్తవాలేనని తేలిపోయింది. నోట్ల రద్దు వల్లనే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. వేలాది కంపెనీలు మూతపడ్డాయి, నిరుద్యోగం పెచ్చరిల్లిందని ఆవేదన చెందారు మంత్రి కేటీఆర్. ప్రభుత్వాల పన్ను రాబడి సైతం తగ్గి సంక్షేమ కార్యక్రమాల అమలుకి దెబ్బ తగిలింది. విఫల నోట్ల రద్దు నిర్ణయం పైన ఇప్పటికైనా ప్రధానమంత్రి దేశానికి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టేందుకు అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు.
Read Also: Munugode Mla: కేసీఆర్ ని కలిసిన ఎమ్మెల్యే కూసుకుంట్ల..ఏమన్నారంటే?