Jagdeep Dhankhar: రానున్న రోజుల్లో శక్తివంతమైన దేశంగా భారత్ ఎదుగుతుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో భారత్ ఎదుగుదలలో వ్యవసాయ రంగం గణనీయమైన ప్రగతిని సాధించిందని ఆయన అన్నారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఇర్ఐ) 61వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 2022 సెప్టెంబర్‌లో భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు.
Read Also: China People: ‘సోలో బతుకే సో బెటర్’ అంటున్న చైనీయులు
వ్యవసాయం భారత్‌కు వెన్నెముక లాంటిదని.. ప్రధానంగా వ్యవసాయం, వ్యవసాయ అధారిత పరిశ్రమల కారణంగా .. ఈ రోజు ప్రతి ఒక్కరూ భారత్ వైపు చూస్తున్నారని జగదీప్ ధన్ కర్ అన్నారు. భారత్ అవకాశాలకు, పెట్టుబడులకు భారత్ అందరికీ ఇష్టమైన ప్రదేశంగా పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అంగీకారయోగ్యమైన విధానాలు అమలులో ఉన్నాయన్నారు. ఈ దశాబ్దం నాటికి భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది ఆయన జోస్యం చెప్పారు. కార్యక్రమంలో 14 మంది విదేశీయులతో సహా 402 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
Read Also: Indigo Flight: దారితప్పిన విమానం.. ఢిల్లీ వెళ్లాల్సింది భోపాల్కి