ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ పర్యటనలో ఉన్నారు. సివాన్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఈ వేదిక నుంచి పునాది వేశామని ప్రధాని మోడీ అన్నారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ బీహార్‌ను ఉజ్వల భవిష్యత్తు వైపు తీసుకెళ్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు సాధారణ ప్రజల జీవనాన్ని మెరుగు పరుస్తాయన్నారు. పేదరికాన్ని తగ్గించవచ్చని తాము చూపించామని, ప్రపంచ బ్యాంకు సైతం భారతదేశానికి అభిమానిగా మారిందని మోడీ అన్నారు.
RBI : దేశంలో గడచిన కొన్ని సంవత్సరాలుగా చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లు దశలవారీగా మార్కెట్ నుంచి తొలగించబడుతున్నాయి. ఇప్పటికే ఎక్కువ శాతం నోట్లను ప్రజలు బ్యాంకుల ద్వారా తిరిగి ఇచ్చారు. అయితే తాజాగా ఈ ప్రక్రియకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు తిరిగి వచ్చిన రూ.2 వేల నోట్ల పరిమాణం 98.26 శాతానికి చేరింది. ఇది మొత్తం విడుదల చేసిన…
India VS Pakistan: భారత్, పాకిస్తాన్ ఒక రోజు వ్యవధితో 1947 ఆగస్టులో స్వాతంత్య్రాన్ని పొందాయి. ఒకప్పుడు, భారత్‌తో పోలిస్తే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉండేది. కానీ ఇప్పుడు, భారత్ ప్రపంచంలోనే అమెరికా, చైనా, జర్మనీల తర్వాత నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. మరోవైపు, పాకిస్తాన్ వరుసగా ఐఎంఎఫ్ నుంచి బెయిలౌట్లు, బాంబులు, అప్పుల్లో కూరుకుపోయింది.
Ind Pak War Effect: ఇండియా – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఉదయం భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” అనంతర పరిణామాలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. గత రాత్రి పాకిస్తాన్ నుండి భారత సైనిక స్థావరాలు, పట్టణాలపై పాకిస్థాన్ దాడులు జరిపే ప్రయత్నం చేసింది. అయితే ఆ మిసైళ్ళు, డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ సమర్ధంగా తిప్పికొట్టింది. Read Also: Rajnath…
బంగ్లాదేశ్ కొత్త వ్యూహాలు, చైనాతో పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని దృష్టిలో ఉంచుకుని, భారతదేశం ఒక పెద్ద అడుగు వేసింది. బంగ్లాదేశ్‌కు ట్రాన్స్ షిప్మెంట్ సౌకర్యాన్ని రద్దుచేసింది. వాస్తవానికి.. ఇటీవల చైనా పర్యటన సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ భారతదేశ ఈశాన్య ప్రాంతం గురించి వివాదాస్పద ప్రకటన చేశారు.
కార్పొరేట్ సంస్థలను కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ సమ్మెట్లో అబద్ధాలు చెప్పడం విచారకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.. ఒక ప్రముఖ ఛానల్ ప్రధానమంత్రితో నిర్వహించిన సమ్మెట్లో దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి లేదని, అభివృద్ధి పెరిగిందని, కాంగ్రెస్‌లో అవినీతి పెరిగిందని చెప్పడం సత్య దూరమని ఆయన అన్నారు. ఎన్. పి. ఎ. కింద 16 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్వయంగా చెప్పారని, 2014 కంటే ముందు…
Kishan Reddy : హైదరాబాద్ ముత్యాల నగరంగానే కాకుండా, ప్రపంచ ఫార్మసీగా, అంతర్జాతీయ స్థాయి ఆస్పత్రుల కేంద్రంగా ఖ్యాతికెక్కిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో 22వ ఎడిషన్ బయో ఆసియా-2025 లాంటి గ్లోబల్ ఈవెంట్స్ నగర వేదికగా జరగడం, హెల్త్‌కేర్ రంగంలోని సాంకేతికత, సుస్థిరమైన పద్ధతుల గురించి చర్చించడం ఎంతో ఆనందకరమని అన్నారు. బుధవారం బయో ఆసియా-2025 సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కిషన్‌రెడ్డి, వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ఆవిష్కర్తలకు పురస్కారాలు అందజేశారు.…
Shehbaz Sharif: తీవ్ర ఆర్థిక సంక్షోభం, వేర్పాటువాదం, ఉగ్రవాదం, మతఛాందసవాదంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పెద్దపెద్ద సవాళ్లు చేస్తోంది. ఏ దశలోనూ భారత్‌తో పోలిక లేదు, అయినా భారత్‌ని ఓడిస్తామని ప్రగల్భాలు పలుకుతోంది. తినడానికి తిండి లేకపోయినా, కింద కోట్ల అప్పులు ఉన్నా కూడా వాస్తవాలను మరిచి ప్రవర్తించడం పాకిస్తాన్‌కే చెల్లుతోంది. తాజాగా, ఆ దేశ ప్రధాని షెహజాబ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పించేలా ఉన్నాయి.
KTR : తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని బీజేపీ అపార్థం చేసుకోవడం దారుణమని, తాము ప్రజా సంక్షేమం కోసం చేసిన ఖర్చును అప్పుగా చిత్రీకరించడం అన్యాయమని మండిపడ్డారు. కేటీఆర్ తన బహిరంగ లేఖలో, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 65 ఏళ్లలో 14 ప్రధానులు కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పు చేసినా, బీజేపీ ప్రభుత్వం కేవలం…
Kishan Reddy : బొగ్గు శాఖ పురోగతిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 2047 వికసిత భారత లక్ష్యాల్లో బొగ్గు రంగం చాలా కీలకమని, ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందన్నారు. బొగ్గు నిల్వల్లో ప్రపంచంలో 5వ స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద బొగ్గు వినియోగదారుగా భారతదేశం ఉందని, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బొగ్గు గని గెవరా మన…