భారత ప్రభుత్వం జీఎస్టీలో విస్తృతమైన మార్పులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుల వల్ల సాధారణ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. చాలా వస్తువులను 12% పన్ను స్లాబ్‌ను తొలగించి, 5% స్లాబ్‌లోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బూట్లు, చెప్పులు, స్వీట్లు, కొన్ని రకాల బట్టలు, పాల ఉత్పత్తులు చౌకగా మారవచ్చని చెబుతున్నారు. కార్లు, పొగాకు, పాన్ మసాలా, శీతల పానీయాలు మొదలైన వాటిపై ప్రస్తుతం విధించే అదనపు సెస్‌ను నేరుగా జీఎస్టీ రేటులోకి చేర్చాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
READ MORE: Coolie : గట్టి పోటీలో ‘కూలీ’ రైట్స్ దక్కించుకున్నది ఎవరంటే?
ఈ మార్పు పన్ను వ్యవస్థను సరళంగా, పారదర్శకంగా చేస్తుందని.. దీంతో రాష్ట్రాలకు ఎక్కువ ఆదాయం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ మార్పుకు అన్ని రాష్ట్రాల సమ్మతి అవసరం. ఎందుకంటే ఇది కొన్ని రాష్ట్రాల పన్ను ఆదాయాన్ని తగ్గించవచ్చు. జూలై మూడవ వారంలో లేదా వర్షాకాల సమావేశం తర్వాత జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించనున్నారు.
READ MORE: Iran: ఇజ్రాయిల్‌పై విజయం సాధించాము, అమెరికాకు చెంపదెబ్బ: ఇరాన్ సుప్రీం లీడర్..
కాగా.. ప్రస్తుతం, పాల ఉత్పత్తులు, జున్ను, పాల పానీయాలు, స్వీట్లు, బూట్లు, కొన్ని బట్టలు, ఇటుకలు, క్లీన్ ఎనర్జీ పరికరాలు అలాగే కొన్ని చేపల ఉత్పత్తులు వంటి అనేక ముఖ్యమైన వస్తువులను 12% పన్ను శ్లాబ్‌లో చేర్చారు. వీటి వల్ల సామాన్యులపై అధిక భారం పడుతోంది. సామాన్యులకు మేలు చేకూరేలా.. వీటిని 5% శ్లాబ్‌లోకి తీసుకు రావాలని కేంద్ర నిర్ణయం తీసుకుంది. వీటిని 5% శ్లాబ్‌లోకి తీసుకు వస్తే ధరలు తగ్గి సామాన్యులకు ఉపశమనం లభిస్తుంది.