Indian economy: జనవరి - మార్చి కాలంలో మార్చి త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 7.8 శాతం నమోదైంది.దీంతో వార్షిక వృద్ధిరేటు 8.2 శాతానికి పెరిగింది. డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన 8.6 శాతం కన్నా తక్కువగా ఉన్నప్పటికీ, గతేడాది(2022-23) ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో(జనవరి-మార్చి)తో పోలిస్తే మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి.
ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బెర్క్షైర్ యాన్యువల్ మీటింగ్లో తొలిసారి ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి వారెన్ బఫెట్ స్పందించారు. భారతదేశంలో షేర్లు గత 20 ఏళ్లలో మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ 'తీవ్రమైన సంక్షోభంలో' ఉంది అని తెలిపాడు.
Indian Economy: అమెరికా, జపాన్, పలు యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉండగా.. కేవలం ప్రపంచంలో ఒక్క భారత ఆర్థిక వ్యవస్థ మాత్రమే ఆశాజనకంగా ఉంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు భారత వృద్ధి రేటు 8 శాతం ఉంటుందని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) సీనియర్ అధికారి భారత ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2047 వరకు తిరుగు ఉండదని చెప్పారు.
India Growth: ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తిరోగమనంలో ఉంటే భారత్ మాత్రం దూసుకుపోతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు భారత వృద్ధి 8 శాతం ఉంటుందని అంచనా వేశాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కూడా ఇదే విషయాన్ని చెప్పింది. భారతదేశం 8 శాతం వార్షిక జీడీపీ వృద్ధిని కొనసాగించగలదని సెంట్రల్ బ్యాంక్ మార్చి బులెటిన్లో ‘స్టేట్ ఆఫ్ ఎకానమీ’ కథనంలో పేర్కొంది. 2021-24 కాలంలో, స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి సగటున…
RBI Bulletin: 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. కార్పొరేట్ ప్రపంచం చేసిన మూలధన వ్యయం కారణంగా, ఆర్థిక వ్యవస్థ తదుపరి దశలో వేగవంతమైన వృద్ధిని చూడవచ్చు.
PV Narasimha Rao: దేశ ఆర్థిక పరిస్థితి ఇలా ఉందంటే, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందంటే దానికి ముఖ్యకారణం మాజీ ప్రధాని పీవీ నరసింహరావు చేసిన సంస్కరణలే కారణం. లైసెన్స్ రాజ్ నడిచే కాలంలో సరళీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధానిగా పీవీ, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక పరిస్థితిని గాడి పెట్టారు. దివాళా తీసే దశ నుంచి ఆర్థిక వృద్ధి పరుగులు పెట్టేలా ఈ ఇద్దరి ధ్వయం ఎన్నో సంస్కరణలు చేసింది.