దీపావళి పండుగ వేళ దేశం ఆర్థికంగానూ వెలిగిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. @CAITIndia రిసెర్చ్ & ట్రేడ్ డెవలప్‌మెంట్ సొసైటీ నిర్వహించిన జాతీయ స్థాయి సర్వే ప్రకారం, దీపావళి 2025 సీజన్‌లో భారత్ మొత్తం రూ. 5.40 లక్షల కోట్ల విలువైన వస్తువులు, రూ. 65,000 కోట్ల వ్యాపారాన్ని రికార్డ్ చేసింది. భారత్ లో జరిగే పండుగల్లో ఈ సారి దీపావళి పండుగ సందర్భంగా జరిగిన బిజినెస్ భారత రిటైల్ చరిత్రలో రికార్డ్ సృష్టించింది.
సర్వే ఎలా జరిగిందో తెలుసా..
దేశవ్యాప్తంగా 60 ప్రధాన మార్కెట్లు, వేలాది వ్యాపారులను కవర్ చేసింది ఈ సర్వే. గత కొన్ని రోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రచారం కూడా భారత వ్యాపార వ్యవస్థ కొత్త మైలురాయిని చేరడానికి ఉపయోగపడిందని చెప్తున్నారు విశ్లేషకులు.. ప్రధాని మోడీ పిలుపునిచ్చిన స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమాలు, సరళమైన జీఎస్టీ సంస్కరణల వల్ల ఆర్థిక వృద్ధి పెరిగింది అంటున్నారు.
గత దీపావళి పండుగకు రూ. 4.25 లక్షల కోట్ల పండుగ విక్రయాలతో పోలిస్తే, 2025 దీపావళి వ్యాపారం 25 శాతం పెరిగింది. రికార్డ్ స్థాయిలో వ్యాపారం జరగడానికి కారణం వినియోగదారుల విశ్వాసం పెరగడం, కొనుగోలు శక్తి మెరుగుపడడం, వస్త్రాలు, పాదరక్షలు, మిఠాయిలు, హోమ్ డెకర్ వంటి రంగాలలో జీఎస్టీ తగ్గింపులు ఫలితంగా సాధ్యమైందని తెలుస్తోంది.
ఈ దీపావళి కి జరిగిన షాపింగ్ ల్లోని
డేటా ప్రకారం, 87 శాతం వినియోగదారులు భారతీయ వస్తువులకే ప్రాధాన్యం ఇచ్చారు, చైనా ఉత్పత్తుల అమ్మకాలు పెద్ద మొత్తంలో తగ్గాయి. భారతీయ తయారీదారుల అమ్మకాలు 2024తో పోలిస్తే సగటున 25 శాతం పెరిగాయి.
CAIT నివేదిక ప్రకారం, దీపావళి వ్యాపార ప్రభావం లాజిస్టిక్స్, ప్యాకేజింగ్, రవాణా, హాస్పిటాలిటీ, డెలివరీ రంగాల్లో దాదాపు 50 లక్షల తాత్కాలిక ఉద్యోగాలను సృష్టించింది. చిన్న , మధ్యతరహా వ్యాపారాలకు శక్తివంతమైన ప్రోత్సాహం ఇచ్చింది. గ్రామీణ, అర్బన్ ప్రాంతాలు మొత్తం విక్రయాలలో 28 శాతం వాటా కలిగి ఉండటంతో, వినియోగ వృద్ధి ఇప్పుడు దేశవ్యాప్తంగా సమానంగా జరుగుతోందని అంచనాలు.
ట్రేడర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ 7.8 నుండి 8.6కి, కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ 8.4కి పెరగడం భారత రిటైల్ రంగంపై ఉన్న విశ్వాసాన్ని సూచిస్తుంది. ఇది వ్యాపార సౌలభ్యాన్ని, వినియోగ వృద్ధిని, పండుగల తర్వాత కూడా కొనసాగుతున్న ఆర్థిక చైతన్యాన్ని ప్రతిబింబిస్తోంది.
దీపావళి వ్యాపార వృద్ధి కేవలం సంఖ్య కాదు. ఇది భారత రిటైల్ రంగం దృఢత్వానికి, కోట్లాది చిన్న వ్యాపారుల నమ్మకానికి నిదర్శనం. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత పండుగలు ఇప్పుడు సాంప్రదాయానికి తోడు అభివృద్ధి పండుగలుగా మారుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.