కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభించారు. అనంతరం నిజామాబాద్ కిసాన్ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. నిజామాబాద్ పసుపు రైతులు మరింత వృద్ధిలోకి రావాలని ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ మోడీ సర్కార్ బోర్డ్ ఏర్పాటు చేసింది.. మోడీ ఏది చెప్పినా చేసి తీరతారు.. డీఎస్ గొప్ప రాజకీయ నాయకుడు.. ఆయన విగ్రహం ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉంది.. నిజామాబాద్ పసుపు రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోబోతోందని అన్నారు.
Also Read:Cricketer Died: సిక్స్ కొట్టి కుప్పకూలిన యువకుడు.. గుండెపోటుతో మృతి
గత కాంగ్రెస్ సర్కార్ పాక్ విషయంలో మెతక వైఖరి అవలంబించింది.. మోడీ సర్కార్ ఈ పదేళ్లలో మూడుసార్లు పాక్ కు భారత్ తడాఖా ఏంటో చూపింది.. ఇప్పటికీ ఇంకా రాహుల్ బాబా ఏవేవో ప్రశ్నలు వేస్తుంటాడు.. ఆపరేషన్ కగార్ చేయాలా, వద్దా..? మావోయిస్టులను లొంగిపోవాలని హెచ్చరించినా లొంగిపోలేదు కాబట్టే ఆపరేషన్ కగార్ చేపట్టాం.. 2026 వరకు మావోయిజమే లేకుండా ఏరివేస్తాం.. బీఆర్ఎస్ సర్కార్ ఎలాంటి అవినీతికి పాల్పడిందో మీకు తెలుసు.. కాళేశ్వరం, టీఎస్ పీఎస్సీ వంటి వాటితో లూటీ చేసింది.. కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎం అయితే.. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఢిల్లీకి ఏటీఎంగా మారింది.. తెలంగాణా జనం బీఆర్ఎస్ జెండా పీకి పారేశారు.. ఇక్కడ కాంగ్రెస్ కు కూడా నూకలు చెల్లే రోజు వస్తోంది.. పసుపు రైతులకు నా శుభాకాంక్షలు అని అమిత్ షా వెల్లడించారు.