ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ను సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్ కు సిద్ధమవుతుంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ గురువారం (ఫిబ్రవరి 6) నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాలో ఒక కీలకమైన మార్పు చోటు చేసుకుంది. టీ20 సిరీస్‌లో అద్భుతంగా ప్రదర్శించిన ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి.. భారత వన్డే జట్టులో చేరాడు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించింది. చక్రవర్తి ఇప్పటి వరకు ఒక కూడా వన్డే మ్యాచ్ ఆడలేదు. కానీ ఈ సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి భారత జట్టులో భాగంగా కానున్నాడు.
Read Also: Canada: పంజాబీ గాయకుడు ప్రేమ ధిల్లాన్ ఇంటిపై కాల్పులు.. పోలీసుల దర్యాప్తు
ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేసి, 9.85 సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు. అతను ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.. అంతేకాకుండా, తన పేరిట ఒక రికార్డును కూడా నమోదు చేశాడు. 33 టీ20 సిరీస్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత బౌలర్‌గా చక్రవర్తి నిలిచాడు. ఈ క్రమంలో “ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కోసం భారత జట్టులో వరుణ్ చక్రవర్తిని చేర్చాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించింది” అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సిరీస్ తరువాత.. చక్రవర్తి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో అవకాశం పొందే అవకాశాలు ఉన్నాయి. కుల్దీప్ యాదవ్ లేదా వాషింగ్టన్ సుందర్ స్థానంలో అతనిని ఎంపిక చేయవచ్చు.
Read Also: Pooja Hegde: నోరు జారి అల్లు అర్జున్ ఫాన్స్ కి టార్గెటయిన పూజా హెగ్డే!
భారత జట్టులో ప్రస్తుతం ముగ్గురు ఫింగర్ స్పిన్నర్లు ఉన్నారు. (రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్). కానీ, చక్రవర్తి తన మణికట్టు స్పిన్నింగ్‌తో జట్టులో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటాడు. ఈ క్రమంలో జట్టు యాజమాన్యం చక్రవర్తి ప్రదర్శనను కొనసాగించాలని కోరుకుంటోంది. ఈ క్రమంలో భారత జట్టు నెట్ సెషన్లలో కూడా చక్రవర్తి బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ కూడా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించాడు. ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తి భారత వన్డే జట్టులో చేరడం.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి బలమైన పోటీదారుగా మారటం లాంటి అవకాశాలు పొందనున్నాడు.