దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఇటీవల రోజుకు వందల సంఖ్యలో విమానాలను రద్దు చేస్తోంది. దీనివల్ల కంపెనీ మూడో త్రైమాసికానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్‌లో భారీ ఆర్థిక నష్టం నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు విమానాల రద్దు కారణంగా ఇండిగోకు సుమారు రూ. 1,800 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. డిసెంబర్ 9 వరకు టిక్కెట్ల రద్దు మూలంగా మాత్రమే ఎయిర్‌లైన్ ఇప్పటికే రూ. 900 కోట్లకు పైగా తక్షణ నష్టాన్ని భరించింది. ఇది ప్రయాణికులకు…
IndiGo: పార్లమెంట్‌లో పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఇండిగోపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే ఏ సంస్థను ఉపేక్షించబోమని, ప్రజల భద్రత విషయంలో ఎలాంటి బేరసారాలు ఉండవని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండిగోకి DGCA నోటీసులు జారీ చేసిందని, ప్రయాణికుల భద్రతే ప్రభుత్వానికి ముఖ్యం అని, ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని DGCAను ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే ఇండిగో సీఈవో,…
Ram Mohan Naidu: గత నెలలో జరిగిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) నివేదిక ప్రాథమిక నివేదికను వెల్లడించింది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు ఆఫ్ కావడంతో, ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయినట్లు తేలింది. అయితే, ఇలా ఎందుకు జరిగిందనే దానిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది.