Ram Mohan Naidu: గత నెలలో జరిగిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) నివేదిక ప్రాథమిక నివేదికను వెల్లడించింది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు ఆఫ్ కావడంతో, ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయినట్లు తేలింది. అయితే, ఇలా ఎందుకు జరిగిందనే దానిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది.
Read Also: Vijayasai Reddy: సిట్ విచారణకు విజయసాయిరెడ్డి హాజరుపై సస్పెన్స్..! అధికారులకు మాజీ ఎంపీ సమాచారం
అయితే, ఈ నివేదికపై పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు శనివారం స్పందించారు. దీనిపై మనం ఇప్పుడే ఏలాంటి నిర్థారణకు రాకూడదని చెప్పారు. మనకు ప్రపంచంలోనే అత్యుత్తమ పైలట్లు, సిబ్బంది ఉన్నారని తాను నమ్ముతున్నానని, దేశంలో పైలట్లు, సిబ్బంది చేస్తున్న అన్ని ప్రయత్నాలను అభినందిస్తున్నానని చెప్పారు. వారే పౌర విమానయానానికి వెన్నెముక అని చెప్పారు. కాబట్టి మనం ఇప్పుడే ఏ నిర్ణయానికి రాకుండా, తుది నివేదిక కోసం వేచి చూద్ధామని విశాఖపట్నంలో విలేకరులతో అన్నారు.