Operation Sindoor: ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో అప్రమత్తత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సెలవుల్లో ఉన్న భారత జవాన్లను వారి విధుల్లోకి తిరిగి రావాలని ఆర్మీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీనితో వెంటనే ఆర్మీ సైనికులు కుటుంబాలను వదిలి తిరిగి సరిహద్దుల వైపు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన మనోజ్ పాటిల్ అనే భారత సైనికుడి పరిస్థితి ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ గా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి…
భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య.. మనదేశంలోని అనేక నగరాలపై పాకిస్థాన్ డ్రోన్ దాడులు నిర్వహించింది. అయితే.. ఈ దాడులను భారత రక్షణ దళం తిప్పికొట్టింది. ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు మీదుగా బైకర్ YIHA-III కామికేజ్ డ్రోన్‌లను ప్రయోగించింది. ఈ డ్రోన్ల ద్వారా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాలనుకుంది పాకిస్థాన్.
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం.. పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మే 9 (శుక్రవారం) రాత్రి కూడా పాకిస్థాన్ భారతదేశంలోని అనేక నగరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత్ ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. భారత సైన్యం ప్రతీకార చర్యలో భాగంగా పాకిస్థాన్ సైన్యానికి చెందిన అనేక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది.
Janhvi Kapoor : పాకిస్థాన్-భారత్ యుద్ధ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల దాకా అందరూ ఇండియన్ ఆర్మీకి మద్దతు పలుకుతున్నారు. జాన్వీకపూర్ ఇప్పటికే వరుసగా పోస్టులు పెడుతూ ఇండియన్ ఆర్మీకి మద్దతు ప్రకటిస్తోంది. తాజాగా యుద్ధ వాతావరణం గురించి సుదీర్ఘ పోస్టు పెట్టింది. ‘ఇన్ని రోజులు మనం యుద్ధం రావొద్దనే కోరుకున్నాం. కానీ టెర్రరిస్టుల మన ప్రజలను చంపుతుంటే సహించేది లేదు. ఇండియా ఎన్నడూ కయ్యానికి కాలు…
IND-PAK Tension: భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసంలో హైలెవల్ మీటింగ్ కొనసాగుతుంది.
High Alert In Taj Mahal: భారత్- పాకిస్తాన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం హై అలెర్ట్ జారీ చేసింది. కీలకమైన ప్రదేశాల్లో సెక్యూరిటీని పెంచింది.
జమ్ముకశ్మీర్ లోని నివాస ప్రాంతాలు, ఆలయాలపై పాకిస్తాన్ నిరంతరం దాడులకు తెగబడుతోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందుకు సాక్ష్యంగా ఓ వీడియోను నెట్టింట పోస్టు చేసింది.
Vikram Misri : భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. పాక్ ప్రభుత్వం ఇండియన్ ఆర్మీపై ప్రత్యక్షంగా యుద్ధం ప్రకటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనిపై భారత ప్రభుత్వం అత్యవసరంగా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సమావేశంలో విదేశాంగ శాఖ సెక్రెటరీ విక్రమ్ మిస్రి స్పందించారు. పాక్ జనావాసాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. తప్పుడు ప్రచారం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించుతోంది. అలాంటి ప్రచారాలను నమ్మవద్దని హెచ్చరించారు. పాక్ ప్రభుత్వంపై అక్కడి ప్రజలే వ్యతిరేకంగా…
భారత్ లో పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులకు పాల్పడిన పాకిస్తాన్ సైన్యం పట్ల కఠినంగా వ్యవహరించాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత సైన్యాన్ని ఆదేశించారు. నియంత్రణ రేఖ వద్ద భారత పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్న పాకిస్తాన్ సైన్యంపై కఠినమైన, శిక్షార్హమైన చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారని వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ తాట తీయాల్సిందేనని సైన్యాన్ని ఆదేశించినట్లు సమాచారం. Also Read:India Pak War : భారత్లో 32 విమానాశ్రయాలు మూసివేత.. భారతదేశం-పాకిస్తాన్…
Operation Sindoor : జమ్మూ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, భారత సైన్యం మరో కీలక ముందడుగు వేసింది. పాకిస్తాన్ వైపు నుండి ఉగ్రవాదుల చొరబాట్లు, ముఖ్యంగా ట్యూబ్-లాంచెడ్ డ్రోన్ల ప్రయోగానికి వినియోగించిన పాకిస్తానీ పోస్టులు , ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను భారత సైన్యం సమర్థవంతంగా ధ్వంసం చేసినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. గత కొద్ది రోజులుగా సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం , ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు పెరిగాయి. ముఖ్యంగా, జమ్మూ సమీపంలోని సరిహద్దు ప్రాంతాల…