Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alia Bhatt: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET పేపర్ లీక్ వ్యవహారంపై నిరసనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి ముంబైతో పాటు పలు రాష్ట్రాల్లో విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తుండగా, వారికి సినీ ప్రముఖుల మద్దతు కూడా పెరుగుతోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్, ప్రీతి జింటా వంటి సెలబ్రిటీలు ఈ ఘటనపై స్పందించగా, తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా ఈ అంశంపై మౌనాన్ని వీడి భావోద్వేగ పోస్ట్ చేశారు.
ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించిన ఆలియా .. విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులు తనను తీవ్రంగా కలిచివేశాయని పేర్కొన్నారు. “గడిచిన కొన్ని రోజులు నా మనసు ముక్కలు చేశాయి. అయితే అదే సమయంలో విద్యార్థులు తమ హక్కుల కోసం చూపుతున్న ధైర్యం నాకు ఆశను కలిగిస్తోంది. ప్రతి విద్యార్థి వెనుక ఒక కల, ఒక కుటుంబం ఆశలు, ఎన్నో త్యాగాలు ఉన్నాయి. వారు కేవలం తమ కోసమే కాదు, వారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరి కోసం పోరాడుతున్నారు” అని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. అంతేకాకుండా, ఈ యువతే దేశ భవిష్యత్తును నిర్మించబోతున్నారని, వారి స్వరాన్ని వినాల్సిన అవసరం ఉందని ఆలియా పేర్కొన్నారు. “భవిష్యత్తు వారిదే. విద్యార్థుల కోసం, విద్యార్థుల చేతనే మార్పు రావాలి. జై హింద్” అంటూ తన సందేశాన్ని ముగించారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఇదిలా ఉండగా, విద్యార్థుల నిరసనలకు మద్దతుగా హుమా ఖురేషి, సాకిబ్ సలీమ్, ప్రకాష్ రాజ్, షబానా అజ్మీ, స్వరా భాస్కర్ తదితర సినీ ప్రముఖులు కూడా సంఘీభావం ప్రకటించారు. మరోవైపు నటి అయేషా ఖాన్ నిరసనల్లో పాల్గొన్న సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను ప్రశాంతంగా నిలబడి ఉన్నప్పటికీ బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లారని అయేషా ఆరోపించారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల తీరును విమర్శిస్తున్నారు. NEET పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక చర్చకు దారితీయడంతో పాటు, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్లు మరింత బలపడుతున్నాయి.
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?