India: డ్రాగన్ కంట్రీ చైనాను సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా రూపొందిన తేలికపాటి యుద్ధ ట్యాంకు జొరావర్‌పై భారత్ నిన్న (శుక్రవారం) ప్రాథమిక పరీక్షలు చేసింది. ఈ సందర్భంగా ఇది అద్భుత ప్రదర్శనను చాటిందని రక్షణ మంత్రిత్వశాఖ చెప్పుకొచ్చింది.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. వరసగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా కిష్ట్వార్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ సిబ్బందికి గాయాలయ్యాయి.
Terrorist Arrested: జమ్మూ కాశ్మీర్‌లోని పూచ్ జిల్లాలో పోలీసులు, భారత సైన్యం సంయుక్త ఆపరేషన్‌లో ఒక ఉగ్రవాద సహచరుడిని అరెస్టు చేసి అతని నుంచి భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Indian Army: జమ్మూ అండ్ కాశ్మీర్ లో వరుసగా ఉగ్రవాదుల బెదిరింపులకు వ్యతిరేకంగా స్థానిక భద్రతను పెంపొందించడానికి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ (VDGs)కి శిక్షణ ఇవ్వడానికి భారత సైన్యం, జమ్మూ పోలీసులు ముందుకు వచ్చారు.
Manipur : భారత సైన్యం, మణిపూర్ పోలీసులు గురువారం సంయుక్త ఆపరేషన్‌లో కాంగ్‌పోక్పి, ఇంఫాల్ తూర్పు జిల్లాల్లోని సున్నితమైన ప్రాంతాలలో భారీ ఆయుధాలు,మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Encounter : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు బుధవారం భారీ చర్యలు చేపట్టాయి. కుప్వారా జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో కనీసం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Army Recruitment Rally: నేటి నుంచి అగ్నివీర్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం పోర్టు స్టేడియంలో భారీ ఆర్మీ ర్యాలీలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ వరకూ జరిగే ఈ నియామక ప్రక్రియలో వివిధ రకాల పరీక్షలు పెట్టే అవకాశం ఉంది. పదో తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులతో పాటు 8వ తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ ట్రేడ్ మ్యాన్ పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు. పోర్టు…
Kirti Chakra: గతేడాది సెప్టెంబర్ నెలలో జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీర మరణ పొందిన కల్నల్ మన్‌ప్రీత్ సింగ్‌కి ఈ స్వాతంత్రదినోత్సవం సందర్భంగా మరణానంతరం ‘‘కీర్తిచక్ర’’ అవార్డును కేంద్ర ప్రకటించింది.
Jammu Kashmir : స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు.. జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ సమయంలో భారత సైన్యానికి చెందిన 48 నేషనల్ రైఫిల్స్‌కు చెందిన ఒక కెప్టెన్ వీరమరణం పొందాడు.
ఆదివారం తెల్లవారుజామున జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని మారుమూల అటవీప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్ జరిగిన ఒక రోజు తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.