భారత్-పాక్ సరిహద్దుల్లో పాకిస్థాన్‌కు చెందిన మరోదుశ్చర్య ఆలస్యంగా వెలుగు చూసింది. పాకిస్థాన్ పౌరులు సరిహద్దులోని 25 మీటర్ల పొడవైన ఫెన్సింగ్ ను కత్తిరించి దాన్ని తీసుకువెళ్లారు.
ఉగ్రవాదులను వేటాడేందుకు దాదాపు 500 మంది పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలను మోహరించినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా తమ చర్యలను వేగవంతం చేసేశాయి.
JammuKashmir : కాశ్మీర్‌లోని దోడాలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భద్రతా బలగాలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గత నాలుగు రోజులుగా దోడాలో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సైనికులు గాలింపు చర్యలు చేపట్టారు.
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లా ప్రధాన కార్యాలయానికి 30 కిలోమీటర్ల దూరంలోని అడవులు, ఎత్తైన పర్వతాలతో చుట్టుముట్టబడిన దేసాలో సోమవారం సాయంత్రం 7.30 గంటలకు భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల తూటాలకు వీర జవాన్లు ధీటుగా సమాధానం చెప్పారు. కాగా.. ఆర్మీ కెప్టెన్ బ్రిజేష్ థాపా, సైనికుడు నాయక్ డి రాజేష్, కానిస్టేబుల్ బిజేంద్ర, అజయ్ సింగ్ గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు.
భారత సైనికులు, జమ్ముకాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ ముమ్మరం చేయగా ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించారు.. అందులో ఓ ఆర్మీ ఆఫీసర్ కూడా ఉన్నారని స్థానిక పోలీసులు పేర్కొన్నారు.
PM Modi : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా భారత సైన్యానికి చెందిన అనేక రక్షణ పరికరాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం దొరుకుతుందని తెలుస్తోంది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ ప్రశాంతంగా ఉన్నట్లు అందరూ భావించారు. కానీ.. ఉగ్రవాదులు ఇప్పుడు జమ్మూని లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు. జమ్మూ ప్రాంతంలో నెల వ్యవధిలో జరిగిన ఐదు పెద్ద ఉగ్ర దాడులు ఏజెన్సీలను అప్రమత్తం చేశాయి.
Kathua Ambush: సోమవారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ అధికారులు మరణించారు. జమ్మూ లోని కథువా జిల్లాలో ఉగ్రవాదులు నక్కి, ఆర్మీ వాహనంపై దాడికి పాల్పడ్డారు. ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించిన ఘటనకు ప్రతీకారం తప్పకుండా తీర్చుంటామని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర అరమనే ఈ రోజు అన్నారు.
Encounter : జమ్మూకశ్మీర్లోని కుల్గామ్లో ఉగ్రవాదులను అదుపు చేసేందుకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు ఎనిమిది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు కూడా వీరమరణం పొందారు.