Jammu Kashmir: ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లాలోని గుల్‌మార్గ్, గందర్‌బల్ జిల్లాలోని గగాంగీర్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో నిందితుల ఆచూకీ కోసం భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. తంగ్ మార్గ్‌తో పాటు జమ్మూ కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అక్టోబర్ 24న బారాముల్లాలో సైనిక వాహనంపై ఉగ్రదాడి చేయడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లతో సహా మరో ఇద్దరు మరణించారు. Read Also: Bomb threats: గుజరాత్ రాజ్‌కోట్ హోటళ్లకు వరస…
జమ్మూకశ్మీర్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు ఆర్మీ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. బారాముల్లా ఉగ్రదాడిపై భారత సైన్యం ఉత్తర కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచీంద్ర కుమార్ శుక్రవారం స్పందించారు.
Jammu Kashmir: బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ సైట్‌లో భారీ ఆయుధాలు కలిగి ఉన్న ఉగ్రవాదిని హతమార్చిందని, అలాగే ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఇంకా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఉగ్రవాది నుంచి ఉపయోగించిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. భారీగా ఆయుధాలు కలిగి ఉన్న ఉగ్రవాదిని ఉమ్మడి బృందం హతమార్చిందని చినార్ కార్ప్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఘటనా స్థలం నుంచి ఒక ఏకే రైఫిల్, 2…
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదుగు తెగపడ్డారు. అమాయకుడైన నాన్ లోకల్ కార్మికుడిని హతమర్చారు. శుక్రవారం ఉదయం బీహార్‌కి చెందిన వలస కార్మికుడు రోడ్డు పక్కన మృతదేహంగా కనిపించాడు. దక్షిణ కాశ్మీర్‌లోని షోషియాన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన ప్రాంతానికి వెంటనే భారత ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు చేరుకుని, హత్యపై దర్యాప్తు ప్రారంభించారు.
Bactrian Camel: ఎత్తైన పర్వత ప్రాంతాలలో ఏ సమయాన పరిస్థితి ఎలా మారిపోతుందో చెప్పలేము. దాంతో అక్కడ పనిచేస్తున్న సైనికులకు సరైన సదుపాయాలూ కల్పించలేని దుస్థితి ఉంది. ఈ పరిస్థితుల మధ్య సరిహద్దుల్లో పహరా కాసేందుకు, అలాగే అవసరమైన సామగ్రిని తీసుకెళ్ళేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై మిలటరీ బలగాలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఇప్పుడు రెండు మూపురాల (Bactrian) ఒంటెలను రంగంలోకి తీసుకొచ్చారు. వీటిని ముక్యముగా బందోబస్తుకు ఉపయోగపడేలా, అలాగే బరువులు మోసేందుకు సహకరించేలా లేహ్ లోని…
Rajnath Singh: దేశ సరిహద్దులో భారత సైన్యం అలర్ట్ గా ఉందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అందువల్లే సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్తతలు జరగడం లేదన్నారు. కానీ, ఈ విషయంలో అజాగ్రత్త పనికి రాదు.. పొరుగు దేశాల నుంచి కవ్వింపు చర్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేశారు.
Indian Army Soldier: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఓ సైనికుడు వీరమరణం పొందాడు. జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో భారత ఆర్మీ జవాను వీరమరణం పొందినట్లు సీనియర్ సైనిక అధికారులు తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, అక్టోబర్ 8న ప్రారంభించిన యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ సమయంలో 161 యూనిట్ టెరిటోరియల్ ఆర్మీకి చెందిన ఇద్దరు సైనికులు అనంతనాగ్ అటవీ ప్రాంతం నుండి అపహరణకు గురయ్యారు. Mahesh Kumar Goud:…
Indian Army: మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్ – హిజ్బుల్లా మధ్య ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో, UN శాంతి పరిరక్షక దళంలో భాగంగా ఇజ్రాయెల్ – లెబనాన్ దేశాల సరిహద్దులో మోహరించిన భారత సైన్యం అక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. లెబనాన్‌లో ఇటీవల జరిగిన పేజర్ పేలుడు హిజ్బుల్లా, ఇజ్రాయెల్ లను యుద్ధం అంచున ఉంచింది. కాగా, శాంతిభద్రతల పరిరక్షణలో భారత సైన్యం కీలక పాత్ర పోషిస్తోంది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్ కింద భారత సైన్యం సమస్యాత్మక…
Odisha custodial assault: ఒడిశాలో ఆర్మీ అధికారికి కాబోయే భార్యపై పోలీసులు కస్టడీలో దాడి చేయడం సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా పోలీసుల తీరు ప్రజల్లో ఆగ్రహానికి గురైంది. ఈ ఘటన చర్చనీయాంశం కావడంతో ఉన్నతాధికారులు స్పందించి, మహిళపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేసింది. అయితే, ఈ ఘటన ఆర్మీ వర్సెస్ పోలీస్‌గా మారింది. చాలా మంది వెటరన్ ఆర్మీ అధికారులు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు వారిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదిక…