Terrorist Arrested: జమ్మూ కాశ్మీర్‌లోని పూచ్ జిల్లాలో పోలీసులు, భారత సైన్యం సంయుక్త ఆపరేషన్‌లో ఒక ఉగ్రవాద సహచరుడిని అరెస్టు చేసి అతని నుంచి భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పూంచ్ జిల్లా పోతా బైపాస్ దగ్గర ఏర్పాటు చేసిన జాయింట్ చెక్‌పోస్టు వద్ద సురంకోట్ నుంచి అనుమానాస్పదంగా వస్తున్న వ్యక్తిని భద్రతా సిబ్బంది గమనించారు. నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో.. సిబ్బంది అప్రమత్తమై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని పోలీసులు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో నిందితుడి వద్ద నుంచి మూడు హ్యాండ్ గ్రెనేడ్లు, భారీగా పేలుడు పదార్థాలతో పాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Telangana DGP: ట్రై కమిషనరేట్లలో శాంతి భద్రతలపై రాజీ పడద్దు.. డీజీపీ ఆదేశం
కాగా, ఉగ్రవాద సహచరుడు మహ్మద్ షబీర్‌గా ఇండియన్ ఆర్మీ గుర్తించింది. నిందితుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) ఆధారిత హ్యాండ్లర్ అజీమ్ ఖాన్‌తో టచ్‌లో ఉన్నాడని.. సూరంకోట్ నుంచి ఆయుధాలను సేకరించమని అజీమ్ ఖాన్ ఆదేశించాడని ప్రాథమిక దర్యాప్తు వెల్లడైంది. ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు షబీర్‌ను అరెస్టు చేశారు. ఈ ఏడాది జూలై నెలలో ఆర్మీ వాహనాలపై దాడిలో ఐదుగురు సైనికుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రదాడితో సంబంధం ఉన్న పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు ఓవర్‌గ్రౌండ్ సహాయకులను కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. అదే విధంగా, ఈ ఏడాది మేలో కూడా ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో ఒక ఉగ్రవాద సహచరుడిని అరెస్టు చేశారు. ఉత్తర కాశ్మీర్‌లోని బందిపొరా జిల్లా నుంచి తీసుకొస్తున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.