Manipur : మణిపూర్లో పోలీసుల సెర్చ్ ఆపరేషన్.. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur : భారత సైన్యం, మణిపూర్ పోలీసులు గురువారం సంయుక్త ఆపరేషన్‌లో కాంగ్‌పోక్పి, ఇంఫాల్ తూర్పు జిల్లాల్లోని సున్నితమైన ప్రాంతాలలో భారీ ఆయుధాలు,మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భారత సైన్యం ఒక భారీ క్యాలిబర్ లాంచర్, ఒక 12-బోర్ డబుల్ బ్యారెల్ రైఫిల్, ఒకటి .177 రైఫిల్ + మ్యాగజైన్, రెండు పిస్టల్స్, ఒక పాంపీ గన్, ఐదు గ్రెనేడ్లు, మందుగుండు సామగ్రి, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ‘మణిపూర్‌లో శాంతి, సుస్థిరతను పునరుద్ధరించే ప్రయత్నంలో హింసాత్మక కార్యకలాపాలను నిరోధించడానికి, దుర్మార్గులను ఎదుర్కోవడానికి భారత సైన్యం తన సెర్చింగ్ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. మణిపూర్ పోలీసులతో కలిసి నిర్వహించిన ఈ జాయింట్ ఆపరేషన్‌లో ఆర్మీ భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించింది.’ అని డీఆర్వో ప్రకటించింది.
Read Also:PM Modi: సింగపూర్ పర్యటన విజయవంతమైంది: ప్రధాని మోడీ
Also Read
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
కచ్చితమైన సమాచారం అందిన తర్వాత భారత సైన్యం, మణిపూర్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. దీని ఫలితంగా కాంగ్‌పోక్పి, ఇంఫాల్ ఈస్ట్ జిల్లాల్లోని సున్నితమైన ప్రాంతాలలో భారీ ఆయుధాలను రికవరీ చేశారు. తద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న దుండగులను పెద్ద దెబ్బ తీశారు. కౌత్రుక్‌లోని నిరాయుధ గ్రామస్థులపై ఇటీవల జరిగిన దాడి తర్వాత ఈ భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ కుకీ ఉగ్రవాదులు డ్రోన్‌ల నుండి బాంబులను జారవిడిచారు. అధునాతన ఆయుధాలను ఉపయోగించారు. దాడి అనంతరం బీజేపీ రాజ్యసభ ఎంపీ లైషెంబా సనజౌబా ఘటనపై దర్యాప్తునకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి దాని సభ్యులతో సమావేశాలు నిర్వహించారు. కోట్రుక్‌లో జరిగిన దాడిలో డ్రోన్‌లను ఉపయోగించినట్లు మణిపూర్ పోలీసులు కూడా ధృవీకరించారు. పశ్చిమ ఇంఫాల్‌లోని కోట్రుక్‌లో హైటెక్ డ్రోన్‌లను ఉపయోగించి కుకీ మిలిటెంట్లు అనేక రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్‌లను మోహరించారు. అలాగే, భద్రతా దళాలు, పౌరులను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ల నుండి బాంబులు జారవిడిచారు. ఇలాంటి దాడులు పెద్ద కుట్రను సూచిస్తున్నాయి.
Read Also:Devara: దేవర తెలుగు రాష్ట్రాల ప్రీమియర్స్ షోస్ లిస్ట్.. దడ పుట్టాల్సిందే..
మణిపూర్ హైకోర్టు ఆదేశాల ప్రకారం 3 మే 2023న భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య హింస ప్రారంభమైంది. అది ఇప్పటికీ పూర్తిగా శాంతించలేదు. ఇంఫాల్ లోయలో నివసించే మెజారిటీ మెయిటీ కమ్యూనిటీ, చుట్టుపక్కల కొండలలో నివసిస్తున్న కుకీ-జో గిరిజన సంఘం మధ్య జాతి వివాదం మొదలైంది. మణిపూర్ ప్రభుత్వాన్ని మెయిటీ కమ్యూనిటీని ఎస్టీ కేటగిరీలో చేర్చాలని కోరింది. అయితే, హింస ప్రారంభమైన ఒక సంవత్సరం తర్వాత, మణిపూర్ హైకోర్టు తన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.
తాజావార్తలు
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!