Operation Sindoor: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై 4 ఏళ్లు, ఇజ్రాయిల్-గాజా యుద్ధం మొదలై 3 ఏళ్లు అయినా ముగింపు లేదు. ఇంకా ఈ యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘యుద్ధాన్ని ఎలా త్వరగా ముగించాలో భారత్‌ను చూసి ప్రపంచం నేర్చుకోవాలి’’ అని అన్నారు. మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా సైనిక…
Defence Forces In KBC 17: కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 17కి హోస్ట్‌గా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మళ్లీ వ్యవహరిస్తున్నారు. అయితే, త్వరలో ప్రసారం కానున్న స్వాతంత్య్ర దినోత్సవ రోజుకు సంబంధించి ప్రత్యేక ఎపిసోడ్ ప్రోమోలో ఆయన దేశ రక్షక వీరులైన భారత రక్షణ దళాల ప్రతినిధులతో కలిసి ముచ్చటించారు.
ఈ ఆపరేషన్‌ను కేంద్ర ప్రభుత్వం, భారత సైన్యం ఎంతో వ్యూహాత్మకంగా అమలు చేశాయని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. మన పౌరులను బలి తీసుకున్న టెర్రరిస్టులను అంతం చేయాలని త్రివిధ దళాలు కోరగానే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని చెప్పుకొచ్చారు.
Pakistan denies: పాక్ మరోసారి ప్రపంచం కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేసింది. అది ఏ విషయంలో అంటే.. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను భారత సైన్యం కూల్చేసినట్లు వాయు సేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే కదా. దీనిపై పాకిస్థాన్ మరోసారి నోరుపారేసుకుంది. ఉగ్రవాద శిబిరాలను ఇండియా నేలమట్టం చేసినప్పటికీ.. తమ సైన్యానికి సంబంధించి ఒక్క విమానం కూడా దెబ్బతినలేదంటూ కవర్ చేయడానికి ప్రయత్నించింది.…
Fighter jets: ప్రస్తుతం యుద్ధ వ్యూహాలు మారుతున్నాయి. అత్యాధునిక ఆయుధాలే కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు ఇప్పుడు 5వ తరం స్టెల్త్ యుద్ధవిమానం అవసరం. ముఖ్యంగా, పాకిస్తాన్, చైనా నుంచి వస్తున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే ఈ కొత్త తరం ఫైటర్ జెట్ చాలా కీలకంగా మారింది.
MiG-21: భారత వైమానిక దళం(IAF)లో 62 ఏళ్ల పాటు సేవలు అందించిన రష్యన్ తయారీ ఫైటర్ జెట్ MiG-21 రిటైర్ కాబోతోంది. చివరి జెట్‌ను సెప్టెంబర్ 19న చండీగఢ్ వైమానిక స్థావరంలోని 23 స్క్వాడ్రన్ (పాంథర్స్) నుంచి ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. 1963లో వైమానిక దళంలో చేరిన మిగ్-21, 1965, 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధాల్లో, 1999 కార్గిల్ యుద్ధం, 2019లో బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సిందూర్‌లలో కీలక పాత్ర పోషించింది.
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’లో భారత్, పాకిస్తాన్ పై సాధించిన విజయం ఇప్పుడు పలు వార్ కాలేజీల్లో, పలు దేశాల ఆర్మీల్లో అధ్యయన అంశంగా మారింది. పాకిస్తాన్ వైమానిక దళాన్ని కేవలం 4 రోజుల్లోనే భారత్ సైన్యం అచేతనంగా మార్చింది. అయితే, ఈ సంఘర్షణ సమయంలో భారత్, పాకిస్తాన్‌ని బకరా చేసిందని ఇప్పుడు అమెరికా వైమానిక దళ మాజీ F-15E, F-16 పైలట్ అయిన ర్యాన్ బోడెన్‌హైమర్ చెప్పారు. భారత్ నిర్వహించిన వైమానిక పోరాటం ఆధునిక ఎయిర్…
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి ఇండోనేషియాలో భారత రక్షణ దళ ప్రతినిధి కెప్టెన్ శివకుమార్ మాట్లాడిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ ప్రారంభ దశలో భారత వ్యూహాన్ని వివరించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది.
భారత వైమానిక దళానికి చెందిన M17 అపాచీ హెలికాప్టర్ శుక్రవారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం, ముందు జాగ్రత్త చర్యలో భాగంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో జరిగిన నష్టంపై అధికారిక సమాచారం అందలేదు. వాస్తవానికి.. పఠాన్‌కోట్ వైమానిక దళ కేంద్రం నుంచి బయలుదేరిన హెలికాప్టర్, సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నట్లు సమాచారం అందడంతో ముందుజాగ్రత్తగా బహిరంగ ప్రదేశంలో ల్యాండ్ అయింది.
Fact-check: ఆపరేషన్ సిందూర్‌లో భారత దాడిని తట్టుకోలేక కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్ ఇంకా తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. 11వైమానిక స్థావరాలు , కీలక ఆయుధ వ్యవస్థలు నాశనమైనప్పటికీ తామే విజయం సాధించామంటూ ప్రగల్భాలకు పోతోంది. భారత్ చేతితో చావు దెబ్బ తిన్నప్పటికీ, విక్టరీ ర్యాలీల పేరుతో పాకిస్తాన్‌లోని ప్రముఖులు, ఆర్మీ సంతోష పడుతోంది. అక్కడి ప్రజల్ని బకరాలను చేయడానికి ఇదంతా చేస్తోంది.