ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు మూడు లక్షల లోపే కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,63,533కి చేరింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,52,28,996కి చేరింది. ఇందులో 2,15,96,512 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 33,53,765 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో ఇండియాలో 4329…
కరోనాను కట్టడి చేయడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పుడు ప్రజల్లో వ్యాక్సిన్‌పై అవగాహన పెరిగినా.. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన మొదట్లో.. ఆది తీసుకోవడానికి వెనుకడుగు వేసినవారు ఎందరో.. ఇప్పటికీ చాలా మందిలో వ్యాక్సిన్ భయం లేకపోలేదు. దీనికి ప్రధాన కారణం.. వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి.. మళ్లీ కోవిడ్ బారిన పడుతున్నారు.. వ్యాక్సినేషన్ తర్వాత కొందరు ప్రాణాలే కోల్పోయారు.. ఇలా అనేక వార్తలు హల్ చల్ చేశాయి.. అయితే, భారత్‌లో వ్యాక్సిన్లతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్…
దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువవుతోంది. సెకండ్ వేవ్ తో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే వుంది. కాగా ఫ్రంట్ వారియర్స్ గా పోరాడుతున్న డాక్టర్లు కూడా మృత్యువాత పడటం కలిచివేస్తుంది. కరోనా మొదటి వేవ్‌లో 730 మంది డాక్టర్లు మృతి చెందగా, సెకండ్ వేవ్‌లో ఇప్పటి వరకు 244 మంది వైద్యులు మృతి చెందినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. ఇక రాష్ట్రాలవారీగా చూస్తే సెకండ్ వేవ్‌లో 69 మంది డాక్టర్ల…
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. పాజిటీవ్ కేసులు గత రెండు రోజులుగా తగ్గుతున్నా మరణాల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ప్రజలను హెచ్చరిస్తోంది. తాజాగా దేశంలో 2,81,386 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,49,65,463కి చేరింది. ఇందులో 2,11,74,076 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 35,16,997 కేసులు ఇంకా యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 4,106 మంది మృతి…
చైనాలో పుట్టిన కరోనా వైరస్ విజృంభణ ఇండియాలోనూ కొనసాగుతోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే, నిన్నటి కంటే స్వల్పంగా కేసులు తగ్గాయి. తాజాగా దేశంలో 3,11,170 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,46,84,077 కి చేరింది. ఇందులో 2,07,95,335 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 36,18,458కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 4,077 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో…
కరోనా కట్టడికి భారత్‌లో వ్యాక్సినేషన్ వీలైనంత వేగంగా కొనసాగించాలని సర్కార్ భావిస్తున్నా… టీకాల కొరత మాత్రం వెంటాడుతూనే ఉంది.. ఈ నెల 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సినేషన్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో ప్రారంభంకాని పరిస్థితి. అయితే.. ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు.. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌తో పాటు.. రష్యా టీకా కూడా భారత్‌కు చేరుకోగా.. ఇప్పుడు భారత్‌కు వ్యాక్సిన్ల పంపిణీపై కీలక ప్రకటన చేసింది అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం ఫైజర్..…
కాస్త పాజిటివ్ కేసులు తగ్గినా.. రికవరీ కేసులు పెరిగినా.. భారత్‌లో కరోనా విలయం మాత్రం కొనసాగుతూనే ఉంది.. సెకండ్ వేవ్‌లో ఇవాళ కూడా 3 లక్షలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి… అయితే, భారత్‌లో కరోనా మహమ్మారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు ఆందోళనర రీతిలో పెరుగుతున్నాయని.. ఆస్పత్రులపాలయ్యేవారి సంఖ్య కూడా పెరిగిపోయిందని.. కోవిడ్ బారినపడి మృతిచెందేవారి సంఖ్య కూడా అధికంగానే…
కరోనాకు చెక్ పెట్టేందుకు క్రమంగా కొత్త వ్యాక్సిన్లు, మందులు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి.. ఇప్పటికే భారత రక్షణ సంస్థ డీఆర్డీవో భాగస్వామ్యంతో కోవిడ్ బాధితుల చికిత్స కోసం 2డీజీ డ్రగ్ ను తయారు చేయగా.. తాజాగా.. 2డీజీ డ్రగ్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆవిష్కరించింది. పౌడర్ రూపంలో ఉండే సాచెట్‌ను విడుదల చేసింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్.. 10వేల మోతాదుల మొదటి బ్యాచ్‌ను వచ్చే వారంలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక, 2-డియోక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ)…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మార్చేసింది. తప్పనిసరిగా ఆఫీస్‌కి వెళ్లి పనిచేసే ఉద్యోగులు కూడా కరోనా కారణంగా ఇంటినుంచే పనిచేయడం మొదలుపెట్టారు. ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు కదలడంలేదు. ఒకప్పుడు ఐటి రంగానికే పరిమితమైన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు దాదాపుగా అన్ని రంగాలకు పాకింది. ఉపాద్యాయులు, ఉద్యోగులు అందరూ ఇంటి నుంచే పనిచేస్తున్నారు. వర్చువల్ విధానం ద్వారా పనిచేస్తున్నారు. మనదేశంలో కూడా ప్రస్తుతం ఇలానే జరుగుతున్నది. మంత్రుల సమావేశాలు, పాలనా పరమైన విధానాలు కూడా…