ఇండియాలో కరోనా జోరు కొంచెం తగ్గుతుంది. కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,59,591 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,60,31,991 కి చేరింది. ఇందులో 2,27,12,735 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 30,27,925 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 4,209 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య…
కోవిడ్ సెకండ్ వేవ్‌తో అల్లాడుతోన్న భారత్‌ను ఆదుకోవడానికి క్రమంగా కొన్ని దేశాలు ముందుకు వస్తున్నాయి.. తోచిన సాయాన్ని చేస్తున్నాయి.. ఇక, ఇప్పటికే గూగుల్, అమెజాన్ ఇండియా లాంటి చాలా సంస్థలు భారీ సాయాన్ని ప్రకటించాయి. ఇందులో భాగంగానే అమెరికా కూడా ఇండియాకు ఆర్థిక సాయం అందిస్తోంది. కరోనా పోరులో ఇప్పటి వరకు ఇండియాకు 500 మిలియన్ డాలర్ల సాయం చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. 80 మిలియన్ల వ్యాక్సిన్లను ఇతర దేశాలకు పంపిణి చేయడంపై త్వరలో నిర్ణయం…
జూన్ 18-22 మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్‌తో ఆడేందుకు భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్లనుంది. ఆ తర్వాత అక్కడే ఉండి ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. కానీ ఈ మధ్యలో జులైలో బీసీసీఐ మరో టూర్‌ను ప్లాన్ చేసింది. గతేడాది కరోనా వాయిదా పడిన శ్రీలంక పర్యటనను తెరమీదకు తీసుకొచ్చింది. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జూలై 13, 16, 19…
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,76,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,57,72,400 కి చేరింది. ఇందులో 2,23,55,440మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 31,29,878 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 3,874 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,87,122 కి చేరింది.…
ఈరోజు ప్రధాని మోడీ దేశంలోని 10 రాష్ట్రాల్లోని జిల్లాల అధికారులతో సమావేశం కాబోతున్నారు. 10 రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్న తరుణంలో జిల్లాల అధికారులతో సమావేశం కావాలని ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్, ఝార్ఖండ్, పుదుచ్చేరి, మహారాష్ట్ర, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడబోతున్నారు. జిల్లాల్లో కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ అధికారులతో చర్చించబోతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ తరువాత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది.
ఇటీవల అరేబియా సముద్రంలో ఏర్పడిన టౌక్టే తుఫాన్ ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తుఫాను ధాటికి పశ్చిమ తీర ప్రాంతం రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వేల కోట్ల రూపాయల నష్టం సంభవించింది. టౌక్టె తుఫాను బీభత్సం నుంచి ఇంకా కోలుకోక ముందే మరో ముప్పు దూసుకు రాబోతున్నది. ఈసారి తూర్పు తీరంలో ఆ ముప్పు ఉండబోతున్నట్టు వాతావరణ శాఖ పేర్కొన్నది. తూర్పు తీరంలోని అండమాన్ కు ఉత్తరాన సముద్రంలో ఈనెల 22 వ తేదీన అల్పపీడనం ఏర్పడే…
డీఏపీ ధరలు పెరుగుతూ రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.. అయితే, కేంద్రం ప్రభుత్వం ఇవాళ రైతులకు అనుకూలంగా చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది.. డీఏపీ ఎరువు ధరలను భారీగా పెంచేందుకు నిర్ణయించిన మోడీ సర్కార్.. అదే సమయంలో.. పెరిగిన భారాన్ని రైతులపై మోపకుండా సబ్సిడీ రూపంలో తామే భరిస్తామని పేర్కొంది. డీఏపీపై ప్రభుత్వ సబ్సిడీని కేంద్ర సర్కార్ 140 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. అంటే.. ఇప్పటి వరకు డీఏపీ బ్యాగ్ ధర రూ. 1,700 ఉండగా.. రూ.…
దేశంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ తర్వాత కొత్తగా నమోదయ్యే కరోనా కేసులు తగ్గాయి. అంతకుముందు వారంతో పోలిస్తే గత వారం 13 శాతం తగ్గిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్ ఇంకా మొదటి స్థానంలోనే కొనసాగుతోందని తెలిపింది. గత వారం ప్రపంచవ్యాప్తంగా 48 లక్షల కేసులు, 86 వేల మరణాలు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ పేర్కొంది. అంతకుముందు వారంతో పోలిస్తే మరణాలు 5 శాతం,…
ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో దేశంలో ఆంక్షలు కఠినంగా అమలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలు భారత ప్రయాణికులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ లిస్టులో ఇప్పుడు సూడాన్ చేరిపోయింది. భారత ప్రయాణికులపై రెండు వారాలపాటు ఆంక్షలు విధించింది. భారత దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో సుడాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ తో పాటుగా ఈజిప్టు, ఇథియోపియా దేశాల ప్రయాణికులపై కూడా సుడాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.