దేశంలో గత కొన్ని రోజులుగా దేశద్రోహం చట్టం పేరు బాగా వినిపిస్తున్నది. ఈ చట్టంపై సుప్రీంకోర్టు ఈరోజు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న తరుణంలో బ్రిటీష్ కాలానికి చెందిన, వలస తెచ్చుకున్న చట్టం అవసరమా అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దేశద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లను విచారించే సమయంలో కోర్టు ఈ రకంగా స్పందించింది.
Read: పాన్ ఇండియా మూవీ లేకుండానే సత్తా చాటిన ప్రిన్స్ మహేశ్!
బ్రిటీష్ కాలంలో దేశద్రోహ చట్టాలను స్వాతంత్య్ర సమరయోధులను శిక్షించేందుకు వినియోగించారని, స్వాతంత్య్రపోరాటాన్ని అణిచివేసేందుకు ఈ చట్టాలను వాడారని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ అనేక పిటీషన్లు దాఖలయ్యాయని, అన్నింటిని కలిపి ఒకేసారి విచారిస్తామని కోర్డు పేర్కొన్నది.