గత కొన్ని రోజులుగా ఉత్తర భారతదేశంలో యూపీ, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పిడుగులు పడుతున్నాయి. పిడుగుపాటు కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. యూపీ, రాజస్థాన్‌లోనే అత్యధికంగా పిడుగులు పడుతున్నాయి. పిడుగులు పడటం వెనుక కారణం ఎంటి? అనే విషయాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. పిడుగుపాటుకు భూమిపై భూతాపం, నగరీకరణే కారణమని అట్మాస్ఫియరిక్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ గ్రూప్ నివేదికలో పేర్కొన్నది. భూమిపై ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగితే పిడుగులు పడే అవకాశం 12శాతం పెరుగుతుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. వేసవిలో సంభవించే కార్చిచ్చుల తరువాత ఎక్కువగా పిడుగులు పడుతుంటాయి.
Read: “టక్ జగదీష్” రిలీజ్ డేట్ ఫిక్స్ ?
కార్చిచ్చుల సమయంలో ఏర్పటిని వేడి వలస మేఘాల్లో క్లౌడ్ కండెన్సన్ న్యూక్లియై పెరుగుతుందని, వ్యతిరేక ఆవేశాలు ఉన్న రేణువుల మధ్య రాపిడి వలన శక్తి ఉద్భవిస్తుందని, ఈ శక్తి పిడుగురూపంలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఏర్పడిన పిడుగులో సుమారు 30 కోట్ల వోల్టుల విద్యుత్ ఉంటుంది. ఇక భారతదేశంలో ఏప్రిల్ 1, 2020 నుంచి మార్చి 31, 2021 వరకు సుమారు 185 లక్షల పిడుగులు పడినట్టు వాతావరణశాఖ పేర్కొన్నది. వాతావరణంలో వస్తున్న మార్పులే పిడుగుపాటుకు కారణమని వాతావరణ శాఖ స్పష్టంచేసింది.