టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లు ఆశలు రేపుతున్నారు. 53 కేజీల మహిళా విభాగంలో ఇండియా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్‌లో శుభారంభం చేశారు. స్వీడన్‌కు చెందిన మ్యాట్‌సన్‌ను 7-1 తేడాతో ఓడించారు. ఈ మ్యాచ్‌లో ఆదినుంచి ఫొగాట్ ఆదిపత్యం సాధించింది. వీలైనంత వరకూ దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిని మట్టికరిపించింది. మొదటి పిరియడ్‌లో 2,2,1 స్కోర్ సాధించిన ఫొగాట్, రెండో పీరియడ్‌లో 2 స్కోర్ మాత్రమే చేసింది. అయితే, స్వీడన్ క్రీడాకారిణి ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క పాయంట్…
నేడు భారత్-ఇంగ్లాండ్ మధ్య నేడు మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మతో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించనుండగా భారత టెస్ట్ స్పిన్నర్ అశ్విన్ అలాగే పేసర్ ఉమేష్ యాదవ్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ మ్యాచ్ లో మొత్తం నలుగురు పేసర్లతో బరిలోకి దిగ్గుతున్న…
ఇండియా పాక్ దేశాల మధ్య ఎలాంటి పోటీ జరిగినా అది ఆసక్తికరంగానే ఉంటుంది. ఇక క్రికెట్ మ్యాచ్ జరిగితే దాని కథ వేరుగా ఉంటుంది. అక్టోబర్ నెలలో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఒమన్, యూఏఈలో జరగనున్నాయి. మార్చి 20 నాటికి టీ 20 ర్యాంకింగ్స్ ఆధారంగా రెండు 12 టీమ్‌లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌లో…
టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. గత ఒలింపిక్స్‌లో కంటే ఈసారి మన ఆటగాళ్లు రాణిస్తున్నారని చెప్పొచ్చు. 1980లో రష్యాలో జరిగిన మాస్కో ఒలింపిక్స్ తరువాత 2021లో జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు సెమీస్‌కు చేరుకుంది. సెమీస్ లో ఓడిపోయినప్పటికీ మంచి ఆటను ప్రదర్శించి భవిష్యత్తులో జాతీయ క్రీడకు తిరిగి పునర్వైభవం రానుందని చెప్పకనే చెప్పారు. ఇక, మహిళల హాకీ జట్టు సెమీస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు…
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్నటి రోజున 30 వేలకు పడిపోయిన కేసులు ఈరోజు తిరిగి 40 వేలకు పైగా నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 42,625 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,17,69,132కి చేరింది. ఇందులో 3,09,33,022 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక, 4,10,353 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 36,668 మంది…
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ -ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు అంతా సిద్ధమైంది. 5 మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇప్పటికే కోహ్లి సేన, జో రూట్ బృందం సన్నద్ధమయ్యాయి. ఈ ఏడాది భారత పర్యటనలో ఇంగ్లండ్.. 3-1 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది ఇంగ్లండ్. నాటింగ్ హాంలో జరిగే మ్యాచ్‌లో శుభారంభం చేసి కోహ్లీసేనపై ఒత్తిడి పెంచేందుకు స్కెచ్ వేస్తోంది ఇంగ్లీష్ టీమ్. అయితే కీలకమైన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, ఆర్చర్…
భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతోంది. ఒలింపిక్స్ హాకీలో… క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో… ఆస్ట్రేలియాను ఓడించి… సంచలనం సృష్టించింది. మూడుసార్లు ఒలింపిక్ విజేత ఆస్ట్రేలియాను మట్టి కరిపించి… సెమీస్‌కు సిద్ధమైంది రాణి రాంపాల్ సేన. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును క్వార్టర్స్‌లో ఓడించడంతో… మహిళల హాకీ జట్టుపై అందరికీ అంచనాలు పెరిగాయి. సెమీస్‌లోనూ అర్జెంటీనా జట్టును ఓడించి… ఫైనల్‌కు దూసుకెళ్లేందుకు వ్యూహాలు రచిస్తోంది. క్రీడాకారులందరూ సమష్టిగా రాణిస్తుండటంతో… రాంపాల్ సేనపై మరింత విశ్వాసం పెరిగింది.…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు భారీ స్థాయిలో కేసులు తగ్గాయి. ఇండియలో తాజాగా 30,549 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,17,26,507కి చేరింది. ఇందులో 3,08,96,354 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 422 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 4,25,195 మంది మృతి…
టోక్యో ఒలింపిక్స్‌లో సంచలనాలు నమోదు చేసిన హాకీ పురుషుల జట్టు సెమీస్‌లో పరాజయం పాలైంది. వరల్డ్ ఢిపెండింగ్ చాంపియన్ బెల్జియం చేతిలో 5-2 తేడాతో ఓడిపోయింది. మొదటి క్వార్టర్లో 2-1 తేడాతో లీడ్‌లో ఉన్న ఇండియా సెకండ్ క్వార్టర్లో సంచలనాలు చేయలేకపోయింది. అటు బెల్జియం జట్టు తనదైన శైలిలో విజృంభించి మరో గోల్ చేయడంతో సెకండ్ క్వార్టర్ 2-2తో సమం అయింది. అయితే, మూడో క్వార్టర్లో ఎవరూ ఎలాంటి గోల్ చేయలేదు. కానీ నాలుగో క్వార్టర్లో బెల్జియం…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్… అన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాయి.. అయితే, వ్యాక్సిన్ పంపిణీలో ఒడిశా రాజధాని భువనేశ్వర్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.. వంద శాతం లక్ష్యాన్ని చేరుకుని రికార్డుకెక్కింది.. సిటీలోని 18 ఏళ్లు పైబడిన అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ రెండు డోసులు పంపిణీ చేసింది.. అదనంగా దాదాపు లక్ష మంది వలస కార్మికులకు మొదటి డోసు వ్యాక్సిన్ కూడా అందించారు.. ఈ విషయాన్ని భువనేశ్వర్ మున్సిపల్…