భారత జట్టులో కరోనా కలకలం రేపింది. టీం ఇండియా హెడ్ కోచ్ రవి శాస్త్రికి కరోనా పాజిటివ్ గా తేలింది. నిన్నటి నుంచి కాస్త అస్వస్థకు గురైన ఆయన… ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే… ఈ కరోనా పరీక్షల్లో కోచ్ రవి శాస్త్రికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో కోచ్ రవి శాస్త్రి కి హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. అలాగే… రవి శాస్త్రి తో సన్నిహితంగా ఉన్నటు వంటి బౌలింగ్ కోచ్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, పిజియోథెరఫిస్ట్ నితిన్ పటేల్ ను కూడా సెల్ఫ్ ఐసోలేషన్ లోకి పంపినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇక అటు టీమిండియా ఆటగాళ్లకు అందరి కరోనా నెగిటివ్ రావడంతో ఇవాళ్టి మ్యాచ్ కు అనుమతించింది బీసీసీఐ.