రసవత్తరంగా భారత్-ఇంగ్లండ్ టెస్టు..బౌలర్లపైనే భారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. నాలుగో రోజు ఆట పూర్తయేసరికి అతిథ్య జట్టు 77 పరుగులు చేసి దీటుగా బదిలిస్తోంది. ఓపెనర్లు రోరీ బర్న్స్ 31, హమీద్ 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచి శుభారంభం చేశారు. దీంతో చివరి రోజు ఆ జట్టు విజయానికి 291 పరుగులు అవసరం. మరోవైపు చేతిలో పది వికెట్లు ఉండగా భారత్ విజయం సాధించాలంటే వారిని ఆలౌట్ చేయాలి. నాలుగో రోజు ఆట ఫస్ట్ సెషన్‌లోనే భారత్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోర్‌కు రవీంద్ర జడేజా 8పరుగులు జత చేయగా.. రహానే డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీకి చేరువైన కోహ్లీ.. మొయిన్ అలీ బౌలింగ్‌లో స్లిప్‌లో దొరికి పోయాడు. దాంతో భారత్ లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్లకు 329 పరుగులు చేసింది.
తర్వాత రిషభ్ పంత్, శార్దూల్ ఠాకూర్ సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ టీమిండియా భారీ స్కోర్‌కు బాటలు వేసారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన 466 పరుగులకు ఆలౌటైంది.అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు రోరీ బర్న్స్, హసీబ్ హమీద్ మంచి శుభారంభాన్ని అందించారు. భారత బౌలర్లను సమర్థవంతా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. వికెట్ కోసం కోహ్లీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఈ జోడీ అవకాశం ఇవ్వలేదు. ఇప్పటికే తొలి వికెట్ 77 పరుగుల భాగస్వామ్యంతో అజేయంగా నిలిచారు.మొత్తంగా నాలుగో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు.
Also Read
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్ అయితే ఉంచగలిగారు. ఇక జట్టు విజయం బౌలర్ల చేతిలో చేతిలో ఉంది. నాలుగో టెస్టులో ఇవాళే చివరి రోజు. దీంతో వికెట్లు పడకుండా ఆచితూచి ఆడేందుకు ఇంగ్లండ్ ప్రయత్నించే అవకాశముంది. నిన్న 32 ఓవర్లు ఆడినా ఒక్క వికెట్ కూడా పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇవాళ పది వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేయగలిగితేనే విజయం భారత్ సొంతమౌతుంది. అయితే ఓవల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఈ స్టేడియంలో భారీ స్కోరు చేసే అవకాశముంటుంది. ఇంగ్లండ్‌ను కట్టడి చేయడం బౌలర్లకు కత్తిమీద సామనే చెప్పాలి. కాని క్రెకెట్‌లో ఏదైనా సాధ్యమే అంటారు క్రీడావిశ్లేషకులు. భారీ టార్గెట్‌ను అవకాశంగా మలుచుకుని ఆలౌట్ చేసే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి నాలుగో టెస్టు క్రికెట్ లవర్స్‌కు మంచి కిక్ ఇస్తోంది.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!