ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. డెల్టాతో పాటుగా డెల్టాప్లస్, ఏవై 11, ఏవై 12, ఏవై 13 వేరియంట్లు ఇండియాలో విస్తరిస్తున్నాయి. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,30,27,621కి చేరింది. ఇందులో 3,21,81,995 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా… 4,04,874 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 43,903 మంది డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. ఇకపోతే, 24 గంటల్లో 219 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,40,752కి చేరింది.
Read: వైరల్: విగ్గుసంగతి మర్చిపోయి… స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకేసింది… చివరకు…