కొన్ని వారాలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం కుదురుకోవటం పక్కా. అమెరికా , నాటో దళాలకు చెందిన ఆఖరు సైనికుడూ ఆఫ్గన్‌ని వీడాడు. ఇక వారికి ఎదురు లేదు. అయితే ఇది అంతర్జాతీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడే తెలియదు. కానీ మన విషయం చూసుకుంటే కాశ్మీర్లో తాలిబాన్ల ప్రభావం ఉంటుందా అన్నది ప్రశ్న. కశ్మీర్ లోయకు తాలిబాన్లను మళ్లిస్తారా…లేదా అన్నది మరో పెద్ద క్వశ్చన్ మార్క్. ఒక వేళ అదే జరిగితే ఇప్పటికే…
కరోనా మహమ్మరి పేరు చెబితేనే ప్రపంచం ఉలిక్కి పడిపోతుంది. కంటికి కన్పించకుండా ఈ మహమ్మరి ప్రపంచాన్ని మొత్తాన్ని కబలించేస్తోంది. ఈ వైరస్ దాటికి ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు మృత్యు అంచులదాకా వెళ్లి బ్రతుకు జీవుడా అంటూ బయటపడ్డ సంఘటనలు అనేకం ఉన్నాయి. భారత్ లోనూ కరోనా ప్రభావం భారీగానే కన్పించింది. అక్టోబర్‌లో థర్డ్ వస్తుందన్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ స్వామినాథన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కరోనా ఫస్ట్…
భారత్‌లో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,618 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. కరోనా బారినపడి మరో 330 మంది ప్రాణాలు వదిలారు.. ఇదే సయయంలో 36,385 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్… దీంతో.. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 3,21,00,001కు పెరగగా.. ఇప్పటి వరకు కరోనాబారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,40,225 కు చేరింది.. మరోవైపు..…
దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్నది. తెలంగాణ మినమా మిగతా నాలుగు రాష్ట్రాల్లో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1520 కేసులు నమోదు కాగా, తమిళనాడులో 1568 కేసులు, కర్ణాటకలో 1220 కేసులు నమోదయ్యాయి. అయితే, కేరళలో మాత్రం ఉధృతి ఏ మాత్రం తగ్గడంలేదు. గడిచిన 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 29,322 కేసులు నమోదవ్వగా, 131 మరణాలు సంభవించాయి. గతంలో మహారాష్ట్ర, ఢిల్లీలో కేసులు భారీ సంఖ్యలో నమోదవ్వగా, ఇప్పుడు ఆసంఖ్య…
ఏరుదాటేదాక ‘ఓడ మల్లన్న’.. ఏరు దాటాక ‘బోడ మల్లన్న’ అన్నట్టుగా ఉంది తాలిబన్ల వ్యవహారశైలి. అప్ఘనిస్తాన్ దేశాన్ని వశపరుచుకోవడానికి ముందు అమెరికాకు, ప్రపంచానికి కల్లబొల్లి మాటలు చెప్పిన తాలిబన్లు ఇప్పుడు ఆ దేశం ఆక్రమణలోకి వచ్చాక తమ అసలు రంగును బయటపెడుతున్నారు. భారత్ సహా ప్రపంచదేశాలకు ఎసరు పెడుతున్నారు. మొన్నటివరకు ‘కశ్మీర్’పై సంబంధం లేదన్న తాలిబన్లు ఇప్పుడు తగ్గేదేలే అంటూ భారత్ వ్యతిరేక ప్రకటన చేయడం సంచలనమైంది. అఫ్ఘాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు మరోసారి తమ…
ఢిల్లీలోని అసెంబ్లీ నుంచి ఎర్రకోట వరకు ఓ సీక్రెట్ సొరంగమార్గం ఉన్నది. ఈ సొరంగ మార్గాన్ని గురువారం రోజున మరోసారి గుర్తించారు. బ్రిటీష్ కాలంలో స్వాతంత్య్ర సమరయోధులను ఈ మార్గం ద్వారా ఎర్రకోటకు తరలించేవారని, అప్పట్లో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని కోర్టుగా వినియోగించేవారని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ పేర్కొన్నారు. 1993 లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మొదటిసారి ఈ సొరంగమార్గం గురించి విన్నానని, అయితే, దాని చరిత్ర గురించి తెలుసుకోవాలని ఎంత…
నిండా ముప్పయ్ లేవు గుండెపోటు….పాతికేళ్ల పిల్లాడికి గుండెపోటేంటి విచిత్రం కాకపోతే… అవును ఒకప్పుడైతే ఇది నిజంగా విచిత్రమే. కానీ ఇప్పుడు కామనైంది. 30, 40ల్లో హార్ట్ ఎటార్ బారిన పడే యువత సంఖ్య ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరుగుతోంది. ప్రముఖ టీవీ నటుడు, బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది. ఆయన వయస్సు నలబై ఏళ్లే. ఇంత చిన్న వయసులో గుండెపోటుతో చనిపోవటమే ఈ కలవరానికి కారణం. దీనిని…
తాలిబన్లు అంతే.. ఎప్పుడు ఏం మాట్లాడతారో.. ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి.. తాజాగా, జమ్మూ కశ్మీర్ విషయంలో యూటర్న్ తీసుకున్నారు తాలిబన్లు.. మొదట్లో కశ్మీర్.. భారత్-పాకిస్థాన్ అంతర్గత విషయమని.. అది ఆ రెండు దేశాల ద్వైపాక్షిక అంశమని చెప్పుకొచ్చిన తాలిబన్లు.. ఇప్పుడు మాట మార్చారు.. ముస్లింలుగా కశ్మీర్, భారత్ సహా ఏ దేశంలోని ముస్లింల కోసమైనా గళమెత్తే హక్కు మాకు ఉంది అంటూ ప్రకటించారు.. బీబీసీ ఉర్దూతో మాట్లాడిన తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్..…
టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది… ఇవాళ భారత్ ఖాతాలో మరో పతకం చేరింది… టీ64 పురుషుల హై జంప్‌లో ప్రవీణ్ కుమార్ రజత పతకాన్ని సాధించాడు. 2.07 మీటర్ల జంప్‌తో ఈ పతకాన్ని సాధించాడు ప్రవీణ్ కుమార్.. ఇక, 18 ఏళ్లకే పతకాన్ని అందుకున్న ప్రవీణ్.. సరికొత్త ఆసియన్ రికార్డు నెలకొల్పాడు. తాజాగా పతకంతో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 11కు చేరింది.