దేశంలో గత కొన్ని రోజులుగా బొగ్గు సంక్షోభం కారణంగా విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు కలుగుతున్నాయి. మహారాష్ట్రలోని 13 బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు తాత్కాలికంగా మూతపడిన సంగతి తెలిసిందే. ధర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు నిల్వలు నాలుగురోజులకు మించి లేవని, నాలుగురోజులు దాటితే విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుందని, ఈ సమస్యను పరిస్కరించకుండే విద్యుత్ సరఫరాకు అంతరాయం తప్పదని రాష్ట్రాలు కేంద్రాని విజ్ఞప్తి చేశాయి. ఇప్పటి వరకు అనేకమార్లు కేంద్రం దీనిపై సమీక్ష నిర్వహించింది. దేశంలో బొగ్గు కొరత లేదని, అన్ని ప్లాంట్లకు బొగ్గు వేగంగా సరఫరా అవుతోందని, మంగళవారం నాటికే బొగ్గు సరఫరా 20 లక్షల టన్నులు దాటిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కోల్ ఇండియా నుంచి వేగంగా బొగ్గు ఉత్పత్తి కావడమే కాకుండా వేగంగా సరఫరా కూడా చేస్తున్నారని, ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని కేంద్రం చెబుతున్నది. బొగ్గుగనులు అధికంగా ఉన్న చత్తీస్‌గడ్, జార్ఖండ్‌లో బొగ్గుగనుల శాఖ మంత్రి పర్యటించి క్షత్రస్థాయిలో పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నవరత్న కంపెనీ ఎన్ఎల్‌సీ ఒడిసా గనుల్లో ఉత్పత్తిని 10 మిలియన్ టన్నులకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
Read: ఊరంతా ఖాళీ… కుక్కలకు డ్రోన్‌లతో ఆహారం…