ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా ఇండియాలో 18,987 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,40,20,730 కి చేరింది. ఇందులో 3,33,62,709 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 2,06,586 కేసులు ప్రస్తుతం యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 246 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 4,51,435 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 35,66,347 మందికి టీకాలు వేశారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 96,82,20,997 2 మందికి టీకాలు అందించారు.