గతంలో రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నోట్లు విరివిగా కనిపించేవి. కాని ఇప్పుడు ఆ నోట్లు దాదాపుగా కనిపించడం లేదు. పాత నోట్లు ఏవైనా ఉంటే అవి కనిపిస్తున్నాయి. పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేసిన తరువాత చాలా మార్పులు వచ్చాయి. రూపాయి నుంచి 2000 నోటు వరకు అన్నింటిని చూశాం. అయితే, దేశలో మరో నోటు కూడా ఉన్నది. అదే జీరో నోటు. జీరోకు పెద్ద వ్యాల్యూ ఉండదు. ఈనోటును అవినీతిని అరికట్టేందుకు వినియోగిస్తున్నారట. అయితే, ఈ నోటును ఆర్బీఐ అచ్చు వేయదు. తమిళనాడుకు చెందిన ఓ ఎన్జీవో సంస్థ జీరో నోటును తీసుకొచ్చింది. ఈ నోటు చూసేందుకు అన్ని విధాలుగా రూ.50 ని పోలి ఉంటుంది.
Read: రైతులను చంపుతూ ధర్నాలు చేయడం సిగ్గు చేటు: షర్మిల
అంతేకాదు దీనిపై అన్ని స్థాయిలలో అవినీతిని నిర్మూలించండి, నేను లంచం తీసుకోనని లేదా ఇవ్వనని వాగ్దానం చేస్తున్నాను అని చప్పే స్లోగన్స్ ఉంటాయి. ఈ నోటును అవినీతిని నిర్మూలించేందుకు వినియోగిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే ఈ నోటును ఇస్తున్నారట. ప్రజల్లో అవినీతిపై అవగాహన కల్పిస్తున్నది ఎన్జీవో సంస్థ. పదేళ్లుగా జీరో నోటును ప్రింట్ చేస్తున్నది ఎన్జీవో సంస్థ. జీరోనోట్లను వాలంటీర్లు వివిధ ప్రాంతాల్లో ప్రజలకు పంచుతున్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, చిన్న చిన్న వ్యాపారులకు ఈ జీరోనోట్లను పంచుతున్నారు. లంచం అడిగినపుడు జీరో నోట్లు ఇచ్చి వారిలో మార్పులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారట.