ఆపరేషన్ సిందూర్‌పై రెండోరోజు వాడీవేడిగా పార్లమెంట్లో చర్చ జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. పదే పదే విపక్షాలు అడ్డుపడ్డాయి. పాకిస్థాన్‌పై ఎందుకు యుద్ధం చేయలేదంటూ నినాదాలు చేశాయి. దీంతో అమిత్ షా.. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు.
భారత్-పాకిస్థాన్ యుద్ధంపై మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనని మళ్లీ ట్రంప్ ప్రకటించారు. స్కాట్లాండ్లో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో కలిసి ట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని లేవనెత్తారు.