భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు బంద్..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పుట్టిన అల్పపీడనం వాయుగుండంగా రూపాంతరం చెందుతోంది. బలమైన రుతుపవన గాలులు తోడవడంతో మరికొద్ది గంటల్లోనే బలపడి తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈనెల 19న తీరం దాటుతుందని అంచనా వేస్తుండగా.. ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉదయం నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, అనకాపల్లి,కోనసీమ, కాకినాడ, వెస్ట్ గోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి. విశాఖ నగరంలో విడతలు విడతలుగా అతి భారీ వర్షం కుమ్మేస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై వర్షం నుంచి ఉదృతంగా ప్రవహిస్తోంది. బీచ్ రోడ్డులో ఎర్రటి నీరు ముంచెత్తింది. సముద్రం సైతం రెడ్ కలర్లో కి మారిపోయింది. జ్ఞానాపురం, ఇసుక తోట, KRM కాలనీ, వన్ టౌన్ ఏరియాలోని కొన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో మూడు రోజులు ఇదే వాతావరణం కొనసాగుతూ అత్యంత భారీ వర్షాలు నమోదు హెచ్చరికలు ఉన్నాయి. దీంతో జీవీఎంసీ పార్టీ స్థాయి సన్నద్ధత తో పనిచేస్తోంది. తీరం దాటిన తర్వాత వాయుగుండం అధిక ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలకు ఆస్కారం వుంది. అయితే, భారీ వర్షాల నేపథ్యంలో నేడు విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్లు.. భారీ వర్షాల దృష్ట్యా సెలవులు ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, తూగో, పగో, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు..
ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. లైన్ దాటొద్దు..!
ఎవరు కూడా వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు .. ఈ మధ్యకాలంలో ఏ సందర్భం దొరికిన ఎమ్మెల్యేలు పనితీరు గురించే సీఎం చంద్రబాబు పర్రస్తావిస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు ఇబ్బందికరంగా ఉందంటూ… ఇప్పటికే చాలాసార్లు సీఎం చంద్రబాబు హెచ్చరించారు.. చాలా మీటింగుల్లో చెప్పారు.. కానీ, ఎంత చెప్పినా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరులో ఏమాత్రం మార్పు రావట్లేదు. తాజాగా ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు… ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ను హెచ్చరించారు సీఎం చంద్రబాబు. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. లేటెస్టుగా కూన రవికుమార్ తీరుపై ఓ మహిళ ప్రిన్సిపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వేధింపులు ఎక్కువయ్యాయని తనను అనవసరంగా వేధిస్తున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు.. దీనిపై కూన రవికుమార్ క్లారిటీ ఇచ్చారు.. విద్యార్థినుల అడ్మిషన్లకు అక్రమంగా డబ్బులు వసూలు చేయడం, వారికి ఉపయోగించాల్సిన నిత్యావసరాలను దారి మళ్లించడం వంటి అంశాలను ప్రశ్నించినందుకు, ప్రిన్సిపల్ వైసీపీ నేతలతో కలిసి తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు కూన.. తల్లికి వందనం కార్యక్రమంపై ముగ్గురు ప్రిన్సిపల్స్‌తో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, కేవలం పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్‌తోనే వీడియో కాల్ తీసుకున్నట్లు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇక, జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు.. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు మంచిది కాదన్నారు..చంద్రబాబు.. జనంలో ఈ రకమైన వ్యాఖ్యలు.. తప్పుడు సంకేతాలు వెళ్లే విధంగా ఉంటాయన్నారు… ఇక గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ వ్యవహారంపై కూడా సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు… వీడియో కాల్స్ అసభ్య పదజాలం.. అసభ్యకరమైన వీడియోలు ఉంటే .. ఆ ఎమ్మెల్యేల మీద జనంలో చులకన భావం కలిగిస్తుందని ఇలాంటి విషయాలపై చాలా జాగ్రత్తగా ఉండాలని సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది … మొన్న ఆగస్టు 15న కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి కుర్చీ విషయంలో అధికారి మీద సీరియస్ అయిన పరిస్థితి.. ఇలాగే ప్రతి జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యే ల వ్యవహార శైలి.. సీఎంకు ఇబ్బంది కలిగిస్తోంది.. ఎమ్మెల్యేల వ్యవహరి శైలి పై ఇప్పటికే చాలా సందర్భాల్లో హెచ్చరించారు చంద్రబాబు…
విషాదం మిగిల్చిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. కరెంట్ తీగలు తాకి ఐదుగురు మృతి!
హైదరాబాద్ నగరంలోని రామంతపూర్ గోఖలే నగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఘోర విషాదం చోటుచేసుకుంది. శ్రీకృష్ణుడి విగ్రహ శోభాయాత్రలో రథం విద్యుత్ తీగలకు తాకడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా మారడంతో వారిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కృష్ణ యాదవ్ (24), శ్రీకాంత్ రెడ్డి (35), సురేష్ యాదవ్ (34), రుద్ర వికాస్ (39), రాజేంద్ర రెడ్డి (39) మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం రాత్రి 9 గంటలకు శోభాయాత్ర ప్రారంభమైంది. వర్షం కారణంగా ఆలస్యంగా కొనసాగిన యాత్ర అర్థరాత్రి 12.30 సమయంలో యాదవ సంఘం దగ్గరికి చేరింది. ఈ సమయంలో రథాన్ని లాగుతున్న జీప్ మొరాయించడంతో నిర్వాహకులు చేతులతో రథాన్ని తోసారు. కొద్ది దూరం వెళ్ళగానే రథం పైభాగం విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ వచ్చింది.
నేడు ఇండియా కూటమి భేటీ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చ
ఇండియా కూటమి సోమవారం సమావేశం కానుంది. ఢిల్లీలో ఉదయం 10 గంటలకు ప్రతిపక్ష నేతలంతా భేటీకానున్నారు. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. మహారాష్ట్ర గవర్నర్ సీపీ. రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం కూడా తమ అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తోంది. రాధాకృష్ణన్‌ను ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థిని ఎంపిక చేయాలని విపక్షం భావిస్తోంది.
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణనే ఎందుకు? బీజేపీ వ్యూహమిదేనా?
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ.రాధాకృష్ణన్ పేరును ఎన్డీఏ కూటమి ప్రకటించేసింది. అనూహ్యంగా ఊహాగానాల్లో వినిపించని పేరు తెరపైకి వచ్చి ఆశ్చర్యపరిచింది. అయితే రాధాకృష్ణన్ ఎంపిక వెనుక బీజేపీకి చాలా వ్యూహం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాధాకృష్ణన్ స్వస్థలం తమిళనాడులోని తిరుప్పూర్. తమిళనాడులో ఆయనకు బీజేపీ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గా పని చేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి తమిళనాడులో బలం పుంజుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షాణిది రాష్ట్రానికి చెందిన వ్యక్తికే ఉపరాష్ట్రపతి పదవి కట్టబెడితే.. ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించినట్లుగా సమాచారం. అంతేకాకుండా దక్షాణిది రాష్ట్రాల్లో సొంతంగా బలం పెరిగే అవకాశాలు ఉంటాయని ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాధాకృష్ణన్ అయితే బాగుంటుందని భావించి బీజేపీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీకి వీర విధేయుడిగా కూడా పని చేసిన చరిత్ర ఉంది. ఇలా అన్ని రకాలుగా రాధాకృష్ణన్‌కు కలిసొచ్చింది. అందుకే ఆయనను ఎంపిక చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
న్యూయార్క్ ఇండియా డే పరేడ్‌లో మెరిసిన టాలీవుడ్ స్టార్ జంట
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ భారత స్వాతంత్య్ర దినోత్సవం ఒక ప్రత్యేకమైన గర్వకారణం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 వేళ, దేశమంతా పతాకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలతో దేశభక్తి వాతావరణం నెలకొంటుంది. అయితే, కేవలం భారతదేశంలోనే కాదు.. అమెరికా సహా ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా మన జాతీయ పండుగను ఘనంగా జరుపుకుంటారు. వాటిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలుస్తున్నది న్యూయార్క్‌లో నిర్వహించే ఇండియా డే పరేడ్. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే ఈ వేడుక, విదేశాల్లో నివసించే భారతీయుల ఐక్యతను, దేశభక్తిని ప్రతిబింబించే అద్భుత వేదికగా నిలుస్తోంది. ఈసారి 43వ ఇండియా డే పరేడ్ మరింత ప్రత్యేకంగా జరిగింది.
కూలీ, వార్ 2కు నేటి నుండి అసలు పరీక్ష
భారీ అంచనాలు, భారీ హైప్, భారీ బుడ్జెట్ తో తెరకెక్కిన రెండు డబ్బింగ్ సినిమాలైన వార్ 2, కూలీ మొత్తానికి ఆగస్టు 14న రిలీజ్ అయ్యాయి. వార్ 2 కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, కూలీ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కింది. వార్ 2 లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తే కూలీలో రజనీకాంత్, ఉపేంద్ర, నాగార్జున, అమిర్ ఖాన్ వంటి హేమ హేమీలు ఉన్నారు. రెండు సినిమాలు స్ట్రయిట్ తెలుగుసినిమాలు అనే రేంజ్ లో తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ రాబట్టాయి. కానీ తొలిరోజు తొలి ఆట నుండే రెండు సినిమాలు మిక్డ్స్ టాక్ తెచ్చుకున్నాయి. వార్ 2 లో యాక్షన్ తప్ప కథ లేదని టాక్ రాగా, కూలీ లోకేశ్ కనకరాజ్ వీకేస్ట్ రైటింగ్ అనే విమర్శలు వచ్చాయి. అయినా సరే కూలీ మొదటి రోజు రికార్డు స్థాయి నంబర్ రాబట్టింది. సౌత్ బెల్ట్ మొత్తం కూలీ భారీ వసూళ్లు కొల్లగొట్టింది. అటు వార్ 2 కూడా ఎన్టీఆర్ అనే స్టార్ ఇమేజ్ ఉండడంతో భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పడు ఈ సినిమాలు రెండు మొదటి వీకెండ్ ఫినిష్ చేసుకున్నాయి. నేడు సోమవారం వర్కింగ్ డే ఇక రోజు నుండి ఈ సినిమాల అసలు రూపం బయటకు వస్తుంది. ఇప్పటికే రెండు సినిమాలు కింద సెంటర్స్ లో కలెక్షన్స్ లో బాగా డ్రాప్ అయ్యాయి. వార్ 2 భారీ నష్టాల దిశగా సాగుతుంది. కూలీ కూడా కొంత మేర నష్టాలు వచ్చేలా ఉన్నాయి ట్రెండ్ చూస్తుంటే. అసలే ఓ వైపు భారీ వర్షాలు, మరోవైపు సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్, అడ్వాన్స్ బుకింగ్స్ సైతం అంతంత మాత్రం. మరి ఈ మండే టెస్ట్ లో ఈ రెండు సినిమాలు ఎలా పర్ఫామ్ చేస్తాయో చూడాలి.