* ఢిల్లీ: నేడు ఉదయం 10 గంటలకు ‘ఇండియా’ కూటమి నేతల సమావేశం
* అమరావతి: ఇవాళ రాత్రి కి ఢిల్లీ కి సీఎం చంద్రబాబు. రేపు కొంతమంది కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం.. ఎల్లుండి ఎన్డీయే పక్షాల సమావేశంలో పాల్గొననున్న ఏపీ సీఎం
* ఇవాళ ఢిల్లీకి మంత్రి లోకేష్. పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ.. రాష్ట్రంలో పెండింగ్బ్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చ
* విశాఖ: నేడు స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట కార్మిక సంఘాల ఆందోళన.. స్టీల్ ప్లాంట్ లోని అన్ని విభాగాలలో ఆపరేషన్ సహా మెయింటినెన్స్ కాంట్రాక్టు అప్పగించడం విడుదల చేసిన ఈఓఐ తక్షణం ఉపసంహరించాలని డిమాండ్..
* విశాఖ: నేడు జిల్లాలో ఇంఛార్జ్ మంత్రి వర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటన. 9 జిల్లాల సాంఘిక, గిరిజన సంక్షేమ అధికారులతో సమీక్ష.. పరదేశి పాలెం దగ్గర గల కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో జర్మన్ వెళ్లే నర్సులతో ముఖాముఖి ……
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి కృష్ణ తేజా వరకు క్యూ లైన్ లో వేచివున్న భక్తులు.. టోకేన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 86,364 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 30,712 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు
* తిరుమల: ఇవాళ నుంచి ఆన్ లైన్ లో నవంబర్ నెల దర్శన టిక్కెట్లు విడుదల.. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం.. ఎల్లుండి మద్యహ్నం 12 గంటలకు లక్కిడిప్ విధానంలో సేవా టిక్కెట్లు కేటాయింపు
* అమరావతి : ఇవాళ బెంగుళూరు నుంచి రాజంపేటకి మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 10 గంటలకు బెంగుళూరు లోని తన నివాసం నుంచి బయలుదేరి హెలిప్యాడ్ దగ్గరకు వెళ్లనున్న జగన్.. ఉదయం 10.30 గంటలకు హెలిక్రాఫ్టర్ లో బయలుదేరి 11.30 గంటలకు రాజంపేట చేరుకోనున్న జగన్..
* నేడు విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరి జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవు.. భారీ వర్షాల దృష్ట్యా సెలవులు ప్రకటించిన మూడు జిల్లాల కలెక్టర్లు
* అమరావతి: ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు. కొన్ని కీలక అంశాలపై సమీక్ష. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ప్రత్యేక సమీక్ష చేసే అవకాశం.. సాయంత్రం 6 గంటల కు విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు…..
* నేడు ఏలూరు కలెక్టరేట్ లో డీఆర్‌సీ సమావేశం.. జిల్లా అభివృద్ధిపై ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష..
* పల్నాడు జిల్లా: పులిచింతల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదప్రవాహం. ఇన్ ఫ్లో లక్షా 93 వేల 916 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో లక్షా 84వేల 867 క్యూసెక్కులు. ఐదు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు ప్రజా సమస్యల పరిష్కారానికి. జిల్లా కలెక్టర్ లో యథాతధంగా పీజీఆర్ఎస్ కార్యక్రమం.. 1100 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదుల పరిష్కార వేదిక.. 9552300009 వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు- కలెక్టర్ పి ప్రశాంతి
* తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డితో నేడు మూలాఖత్ కానున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామ రెడ్డి , కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి , సుగవాసి బాలసుబ్రమణ్యం
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లెక్సీలు, బ్యానర్లపై నిషేధం విధించడంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు.. హాజరు కానున్న అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వ్యాపార సంస్థల యాజమాన్యాలు..
* విజయనగరంలో నేడు పర్యటించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్ మాధవ్.. కోట జంక్షన్ లో ఛాయ్ పై చర్చ.. అనంతరం ర్యాలీ..
* కర్నూలు: నేడు కోడుమూరు (మం) ముడుమలగుర్తి శ్రీ ఉరుకుందు వీరన్న స్వామి ఆలయంలో శ్రావణ నాలుగవ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు
* శ్రీకాకుళం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తో ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా విస్తారంగా కురుస్తున్న వర్షాలు . పూర్తిగా అప్రమత్తం ఆయన జిల్లా అధికార యంత్రాంగం. వర్షాల కారణంగా పాఠశాల లకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ .
* శ్రీ సత్యసాయి : పెనుకొండలో అన్నదాత సుఖీభవ, సీఎం కిసాన్ పథకం కింద తొలి విడత పెట్టుబడి సాయం విడుదలైన సందర్భంగా మంత్రి సవిత ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ల ర్యాలీ.
* అనంతపురం : తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం ఓవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీ… మరోవైపు శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపు
* విజయవాడ: లిక్కర్ స్కాం కేసులో నేడు కీలక తీర్పులు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు.. కేసులో ఆరుగురు నిందితుల బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్లు మీద నేడు తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు ..
* ఉమ్మడి మెదక్ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా దంచికొడుతున్న వాన.. సిద్దిపేట జిల్లా గౌరారంలో 23.5 సెం. మీ అత్యంత భారీ వర్షం.. ములుగు 18.6, బేగంపేట 16.2, అంగడి కిష్టాపూర్ 14.1 సెం. మీ వర్షపాతం నమోదు.. మెదక్ జిల్లా ఇస్లాంపూర్ లో 17.8 సెం. మీ అతి భారీ వర్షం.. కౌడిపల్లి 17.2, చిన్నశంకరంపేట 16.4, దామరంచ 15.8, మాసాయిపేట 14.8 సెం. మీ వర్షపాతం నమోదు.. సంగారెడ్డి జిల్లా కంగ్టి 16.6 సెం. మీ అతి భారీ వర్షం
* మహబూబ్ నగర్ జిల్లా: జూరాలకు పోటెత్తుతున్న వరద.. 17 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల .. ఇన్ ఫ్లో 1,50,000 క్యూ సెక్కులు.. ఔట్ ఫ్లో 1,53,560 క్యూసెక్కులు. ఎగువ, దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల నుంచి 12 యూనిట్లతో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. ఎత్తి పోతల పథకాలకు నీటి విడుదల.
* ఆదిలాబాద్: ప్రజావాణి రద్దు.. నేటి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ల లో జరగాల్సిన గ్రీవెన్స్ సెల్ రద్దు. వర్షాల నేపథ్యంలో రద్దు చేస్తూ ప్రకటన.
* శ్రీరాంసాగర్ కు పోటెత్తిన వరద.. ఇన్ ఫ్లో లక్షా 48 వేల క్యూసెక్కులు.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు.. ప్రస్తుత నీటి మట్టం 1088 అడుగులు
* సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.. ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు.. జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
* కామారెడ్డి జిల్లా: నిజాంసాగర్ ప్రాజెక్టు పోటెత్తిన వరద.. 7 వరద గేట్ల ఎత్తివేత, 58, 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు
* సిద్దిపేట, మెదక్ జిల్లాలో కుంభవృష్టి నేపథ్యంలో హై అలెర్ట్.. ఆయా జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు.. మెదక్ జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 93919 42254.. అత్యవసర పరిస్థితుల్లో నెంబర్ కి కాల్ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచన.. సిద్దిపేట జిల్లా సీపీ ఆఫీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 87126 67100\
* భద్రాద్రి జిల్లాలో వర్షాల వల్ల నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. మణుగూరు, ఇల్లందు, సత్తుపల్లిలో ఓపెన్ కాస్ట్ లలోకి వర్షపు నీటి తో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
* నేడు భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
* మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న వర్షం. శ్రీరాం పూర్, కళ్యాణి ఖని, ఖైరి గూడ, ఇందారం ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి