రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకే భారతదేశంపై ట్రంప్ సుంకాలు విధించారని వైట్ హౌస్ తెలిపింది. ఈ మేరకు యూఎస్ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Rekha Gupta Attacked: ఢిల్లీ సీఎంకు చేదు అనుభవం.. రేఖా గుప్తాను చెంపదెబ్బ కొట్టిన యువకుడు
ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందం చేసేందుకు పుతిన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు భారత్‌పై ట్రంప్ సుంకాలు విధించాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. రష్యాపై ఒత్తిడి తీసుకురావడం కోసమే ఈ జరిమానా విధించాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగియాలని ట్రంప్ బలంగా కోరుకుంటున్నారని.. అందుకోసమే రష్యాపై ఒత్తిడి పెంచేందుకు భారత్‌పై సుంకాలు విధించాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. వీలైనంత తర్వాతగా ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి నెలకొల్పాలని ట్రంప్ భావిస్తున్నట్లుగా లీవిట్ తెలిపారు. ట్రంప్‌తో జెలెన్‌స్కీ, యూరోపియన్ నేతల సమావేశం విజయవంతం అయిందని చెప్పారు. శాంతి కోసం ట్రంప్ అవిశ్రాంత ప్రయత్నాలు చేయడం వల్లే పుతిన్‌తో సమావేశం జరిగిన 48 గంటల్లోనే యూరోపియన్ నాయకులు వైట్‌హౌస్‌లో ఉన్నారని లీవిట్ అన్నారు.
ఇది కూడా చదవండి: Archana Tiwari: వీడిన రైల్లో అదృశ్యమైన అర్చన తివారీ మిస్టరీ! ఏమైందంటే..!
భారత్‌పై తొలుత 25 శాతం సుంకాన్ని ట్రంప్ విధించారు. ఇది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇది ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానుంది. దీంతో భారత్‌పై అత్యధికంగా 50 శాతం సుంకాన్ని విధించారు.