* ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన జరగనున్న కేంద్ర కేబినెట్.. మధ్యాహ్నం 1 గంటకు భేటీ.. పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం
* హైదరాబాద్: 16వ రోజుకు చేరిన సినీ కార్మికుల సమ్మె.. ఉదయం 10 గంటలకు ఇందిరా నగర్ లో సినీ కార్మిక సంఘాల సర్వసభ్య సమావేశం.. సమస్యలు పరిష్కరించబడాలని సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి కి పాలాభిషేకం చేయనున్న సినీ కార్మికులు.. నేడు మరోసారి చిరంజీవిని కలువనున్న ఫెడరేషన్ నాయకులు , నిర్మాతలు.. సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నాయకుల సమావేశం.. 16 వ రోజు సమ్మె తో స్తంభించిన టాలీవుడ్
* నేడు వికారాబాద్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు పర్యటన
* శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి.. 10 గేట్లు 12 అడుగులు మేర ఎత్తివేత.. ఇన్ ఫ్లో 3,73,024 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 3,70,158 క్యూసెక్కులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
* అమరావతి : బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన తీవ్ర అల్పపీడనం.. ఇవాళ ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా సమీపంలో గోపాలపూర్ వద్ద తీరం దాటే అవకాశం.. తీరం వెంబడి గంటకు 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు.. కోస్తాలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం..
* పెరుగుతున్న కృష్ణానది వరద ప్రవాహం.. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉధృతంగా వరద.. మధ్యాహ్నంలోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం
* పులిచింతల ప్రాజెక్టుకు భారీగా పెరిగిన వరదప్రవాహం. ఇన్ ఫ్లో… 3లక్షల 84వేల 692 క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 4లక్షల 18వేల 982 క్యూసెక్కులు..
* అమరావతి : ఇవాళ మాజీ వైఎస్ జగన్ అన్నమయ్య జిల్లా పర్యటన.. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి సోదరుడి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్న జగన్.. అనంతరం తిరిగి బెంగుళూరుకు వెళ్లనున్న జగన్..
* అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు p 4 కార్యక్రమం ప్రారంభం. మంగళగిరి లో కన్వెన్షన్ సెంటర్. లో p4 లాంచింగ్.. హాజరవుతున్న సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
* అమరావతి: రేపు మెగా డీఎస్సీ సర్టిఫికేట్స్ పరిశీలన అభ్యర్థుల జాబితా.. ఇప్పటికే స్పోర్ట్స్ కోటా వివరాల సేకరణ
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డితో మూలాఖత్ కానున్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, వంగ గీత
* తూర్పుగోదావరి జిల్లా: రేపు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ప్రారంభం.. ఆ రోజు మధ్యాహ్నం ఆనం కళాకేంద్రంలో సీఎం వర్చువల్ గా పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి ఏర్పాట్లు
* తూర్పుగోదావరి జిల్లా:ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద పెరుగుతున్న గోదావరి వరద .. ప్రస్తుతం బ్యారేజీ 175 గేట్ల నుంచి 8 లక్షల 23 వేల క్యూసెక్కుల వరద జలాల సముద్రంలో విడుదల.. బ్యారేజ్ నీటిమట్టం 10.5 అడుగులు
* అమరావతి: తాడిపత్రి వెళ్లేందుకు పెద్దిరెడ్డి కి అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ పోలీసుల పిటిషన్.. నేడు విచారణ జరపనున్న ఏపీ హైకోర్టు.. తాడిపత్రిలో ఉన్న ఇంటికి వెళ్లేందుకు పెద్దిరెడ్డి కి భద్రత కల్పించాలని ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సవాలు చేసిన పోలీసులు
* నెల్లూరు: జిల్లా సెంట్రల్ జైలు నుంచి ఇవాళ విడుదల కానున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. ఎనిమిది కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానాలు.. మధ్యాహ్నం 3 తరువాత కాకాణి విడుదల అయ్యే అవకాశం..
* తిరుమల: 25 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 80,502 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 31,890 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.88 కోట్లు
* నేడు పల్నాడు జిల్లా నర్సరావుపేట, వినుకొండలో మంత్రి అచ్చెనాయుడు పర్యటన. వినుకొండ మార్కెట్ యారగడులో మెగా కిసాన్ మేళాలో పాల్గొనున్న మంత్రి అచ్చెనాయుడు. నర్సరావుపేటలో అన్నదాత సుఖీభవ ర్యాలీలో పాల్గొనున్న మంత్రి.
* నేడు శ్రీశైలంలో ఏపీ మంత్రి సంధ్యారాణి పర్యటన.. సుండిపెంటలోని ఐటీడీఏ కార్యాలయం సందర్శించనున్న మంత్రి.. గిరిజన, మహిళ శిశు సంక్షేమశాఖ అధికారులతో మంత్రి సుధారాణి సమీక్షా సమావేశం
* పోలవరం వద్ద కొనసాగుతున్న గోదావరి వరద ఉధృతి.. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే వద్ద గోదావరి వరద నీటిమట్టం 31.680 మీటర్లు.. కాపర్ డ్యాం వద్ద 32.310 మీటర్ల నీటి మట్టం.. స్పిల్ వే లోని 48 గేట్ల నుండి7,92,679 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల..
* నంద్యాల: నేడు డోన్ మండలంలోని 8 చెరువులను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించలనున్న ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి..
* ఢిల్లీ: పెండింగ్ అంశాలపై తెలంగాణ ఎంపీల ఫోకస్.. నేడు కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు పెండింగ్ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న సీనియర్ ఐఏఎస్ గౌరవ్ ఉప్పల్
* విశాఖలో నేడు మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన… పార్టీ అంతర్గత సమావేశంలో పాల్గొనున్న మనోహర్..