ఇండియా కరోనా కేసులు మళ్లీ క్రమంగా తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 7,350 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 202 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,97,860 కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య 4,75,636 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 91,456 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది…
భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడికి 20 ఏళ్లు నిండాయి… 2001 డిసెంబర్ 13న జరిగిన సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడికి పూనుకున్నారు.. ఈ ఉగ్రవాదులు లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలకు చెందినవారిగా గుర్తించారు.. ఉగ్రదాడిని సమర్థంగా ఎదుర్కొన్న భద్రతా దళాలు.. దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి.. ఇక, ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఒక సీఆర్పీఎఫ్ మహిళతో పాటు, ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి.. ఇలా మొత్తం తొమ్మిది…
మరోసారి మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది భారత్.. మిస్ యూనివర్స్‌గా మిస్ ఇండియా ఎంపికైంది.. పంజాబ్‌కు చెందిన హర్నాజ్ కౌర్ సంధూ.. ఈ టైటిల్‌ను గెలుచుకుంది. సుమారుగా 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్ మూనివర్స్ కిరీటం దక్కింది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా, 2021లో హర్నాజ్‌కౌర్ మిస్ యూనివర్స్‌గా ఎంపికయ్యారు. ఇజ్రాయిల్‌లో 70వ మిస్ యూనివర్స్ పోటీలు జరిగాయి. దక్షిణాఫ్రికా యువతి నుంచి ఎదురైన పోటీని ఎదుర్కొని విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం…
ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్ల పైబడిన వారి అందిరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలని ప్రతిపాదించింది. సోమవారం నుంచి దీని కోసం బుకింగ్స్ కూడా ప్రారంభం అవుతాయని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. కాగా కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 40 ఏళ్ల పైబడిన వారికి బూస్టర్ డోసులు అందించామని తెలిపింది. బూస్టర్ డోసులపై నిర్లక్ష్యం వహించకుండా తీసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు వెల్లడించింది. కాగా ఒమిక్రాన్…
దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అందోళన చెందుతున్నారు. ఈరోజు దేశంలో మొత్తం మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోనూ, రెండో కేసు ఛండీగడ్‌లోనూ నమోదుకాగా, మూడో కేసు కర్ణాటకలో బయటపడింది. ఇప్పటికే కర్ణాటకలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన మరో కేసుతో కలిపి మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. Read: ఆమెకు భారీ టిప్పు ఇచ్చి ఆశ్చర్యపరిచిన కస్టమర్……
ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. తబ్లిగీ జమాత్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ వారిపై నిషేధం విధిస్తున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. ఇస్లామిక్ మతాన్ని కాపాడటమే ధ్యేయమంటూ వ్యాఖ్యలు చేసే ఈ సంస్థపై సౌదీ అరేబియా నిషేధం విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే 1926లో తబ్లిగీ జమాత్ సంస్థ ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో సుమారు 35 కోట్ల ముస్లింలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ముస్లింలకు చెందిన సంస్థను…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ .. కాంగ్రెస్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ వ్యతిరేక ప్రతిపక్ష కూటమి.. కాంగ్రెస్ లేకపోయినా ఏర్పాటు చేయవచ్చని కామెంట్ చేశారు. 1984 తర్వాత కాంగ్రెస్ ఒంటరిగా గెలవలేదని .. గత పదేళ్లల్లో కాంగ్రెస్ 90 శాతం వైఫల్యాల్నే చూసిందన్నారు ప్రశాంత్ కిషోర్. గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి పార్టీ అధ్యక్షుడైతేనే కాంగ్రెస్ పరిస్తితిలో మార్పు వస్తుందని వ్యాఖ్యానించారు . 2019 ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ కనీస పోటీ ఇవ్వలేకపోయిందని…
ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… కాస్త తగ్గాయి కరోనా కేసులు. గత 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 7,774 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. మరో 306 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశ వ్యాప్తంగా మరణాల సంఖ్య 475434 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 92,281 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇక మరో…
అంతరిక్ష రంగంలో ఇండియా దూసుకుపోతున్నది. ఇండియా అంతరిక్ష కేంద్రం ఇస్రో చేపట్టిన ఎన్నో ప్రయోగాలు విజయవంతమయ్యాయి. మార్స్ మీదకు ఇండియా మామ్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంగతి తెలిసిందే. అతి తక్కువ ఖర్చుతో మొదటిసారి చేపట్టిన ప్రయోగం విజయవంతమైన దేశంగా ఇండియా ఖ్యాతిగాంచింది. చంద్రునిపైకి ఉపగ్రహాన్ని పంపినా చివరి నిమిషంలోవాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో చంద్రునిపై చంద్రయాన్ ఉపగ్రహం ల్యాండింగ్ కాలేకపోయింది. Read: కేరళను భయపెడుతున్న బర్డ్ ఫ్లూ… అలప్పుజలో అలర్ట్.. ఇక ఇదిలా ఉంటే, 2023లో…
కరోనా తరువాత ప్రైవేట్ సంస్థలు దూకుడుమీదున్నాయి. స్టాక్ మార్కెట్లలో సుమారు 50 కి పైగా కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. రూ.1.1 లక్షల కోట్లు సమీకరించాయి. ప్రైవేట్ సంస్థల ఐపీఓలు భారీ ఎత్తున నిధులను సమీకరిస్తుండటంతో వచ్చే ఏడాది కూడా ఇదే దూకుడు ఉండేలా కనిపిస్తోంది. ప్రైవేట్ కంపెనీలు దూకుడును ప్రదర్శిస్తుంటే, ప్రభుత్వరంగ కంపెనీలు అవకాశాలను అందిపుచ్చుకోవడం లేదు. ఈ ఏడాది కేవలం రెండు ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. కేవలం రూ. 5,500…