ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.. కరోనా నేపథ్యంలో ఈ పొట్టి ఫార్మాట్‌ను స్టేడియాలకు వెళ్లి ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకుండా పోయింది.. ఇక, స్వదేశంలోనూ మ్యాచ్‌లు జరిగే పరిస్థితి లేదు.. ఎక్కడ మ్యాచ్ జరిగినా.. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడాల్సిందే.. అయితే, ఐపీఎల్‌ను క్యాష్ చేసుకునేందుకు ఎప్పటికప్పుడు హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు.. ఇలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాయి.. మరోవైపు భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. ఈ ఐపీఎల్ సీజన్ కూడా ఇక్కడ జరిగే పరిస్థితి లేదు.. అసలు టోర్నీ ఉంటుందా? లేదా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి.. ఈ సమయంలో.. ఇప్పుడు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోన్న ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన సౌతాఫ్రికాలోనే ఐపీఎల్ 15వ ఎడిషన్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుందనే ప్రచారం సాగుతోంది.. వీలైతే సౌతాఫ్రికా.. అక్కడ కూడా కుదరకపోతే శ్రీలంకలో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.
Read Also: ఇక వైసీపీ అరాచకాల్ని సహించం.. ఒక్కరిపై చేయి పడినా తీవ్ర పరిణామాలు..
ఐపీఎల్ మ్యాచ్‌లు అన్నీ ముంబైలోనే నిర్వహించాలని ఉద్దేశంతో బీసీసీఐ ఉందన్న ప్రచారం కూడా సాగింది.. కానీ, కరోనా విజృంభణ నేపథ్యంలో.. ఐపీఎల్ వేదికను మార్చాలనే ప్లాన్‌లో బీసీసీఐ ఉందట.. గత సీజన్ కోవిడ్ దెబ్బతో మధ్యలోనే టోర్నీ ఆగిపోయిన పరిస్థితి.. మిగతా మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించింది బీసీసీఐ.. ఈసారి కూడా అలాంటి పరిస్థితే వస్తే.. యూఏఈకే వెళ్లాలనే ప్లాన్ ఉన్నా.. ఇదే సమయంలో సౌతాఫ్రికాను కూడా మరో ప్రత్యామ్నాయంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. కాగా, టీమిండియా ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఐపీఎల్ వేదికపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.