ఇండియా చైనా సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య పొడవైన సరిహద్దు ఉన్నది. రెండు దేశాల మధ్య ఖచ్చితమైన సరిహద్దులు లేకపోవడంతో రగడ జరుగుతున్నది. చైనా బోర్డర్‌కు కూతవేటు దూరంలో ఓ టీ దుకాణం ఉన్నది. చందర్ సింగ్ బద్వాల్ అనే వ్యక్తి గత 25 ఏళ్లుగా ఈ దుకాణాన్ని నడుపుతున్నాడు. ఉత్తరాఖండ్‌లోని ఇండియా చైనా బోర్డర్‌లో ఉన్న చివరి దుకాణం కావడంతో దీనిని హిందుస్తాన్‌కి అంతిమ్ దుకాణ్ పేరుతో పిలుస్తున్నారు.
Read: Viral: సామీ సాంగ్‌కు గర్బిణీ డ్యాన్స్… సోషల్ మీడియా ఫిదా…
అక్కడ బోర్డు కూడా ఇదే పేరుతో ఉంటుంది. ఈ దుకాణం ఇప్పుడు టూరిస్ట్ స్పాట్‌గా మారింది. అక్కడి వచ్చిన టూరిస్టులు ఆ దుకాణం వద్ద నిలబడి ఫొటోలు దిగుతున్నారు. దీంతో ఈ దుకాణం యమా ఫేమస్ అయింది. వ్యాపార రంగంలో నిత్యం బిజీగా ఉండే ఆనంద్ మహీంద్రా కూడా ఈ దుకాణం గురించి ట్వీట్ చేశారు. దేశంలో బెస్ట్ సెల్ఫీ పాయింట్ అని, అక్కడ ఒక కప్పు చాయ్ తాగడం మంచి అనుభూతిని ఇస్తుందని ట్వీట్ చేశారు.
One of the best selfie spots in India? An unmatchable slogan: “Hindustan ki Antim Dukan.” A cup of tea there is priceless. https://t.co/7dTxVlHwAG
— anand mahindra (@anandmahindra) February 9, 2022