స్టాక్ మార్కెట్లకు యుద్ధ భయం పట్టుకున్నది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్ని సందిగ్ద పరిస్థితులు మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. గత నాలుగు రోజులుగా స్టాక్ మార్కెట్ సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. ఈరోజు కూడా మార్కెట్లు కుప్పకూలడంతో ఆందోళన మదుపురుల్లో ఆందోళన మొదలైంది సెన్సెక్స్ 382.91 పాయింట్ల నష్టపోయి 57,300.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 114.45 పాయింట్లు కోల్పోయి 17,092.20 పాయింట్ల వద్ద ముగిసింది.
Read: Debate: పాక్ ప్రధాని బంపర్ ఆఫర్… మోడీతో డిబేట్‌కు రెడీ…
ఈరోజు మార్కెట్ పై రష్యా ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులే పూర్తి ప్రభావాన్ని చూపాయి. ఉక్రెయిన్ వేర్పాటు వాదులు అధికంగా ఉన్న ప్రాంతాలను రెండు స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ప్రపంచ దేశాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. రష్యాపై కఠిన ఆంక్షలు విధించాలని ఐరోపా సమాఖ్య నిర్ణయించింది. ఇక రష్యాతో పాటు, రష్యా గుర్తించిన రెండు స్వతంత్ర ప్రాంతాలపై కూడా ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్దమైంది.