ఆంధ్రప్రదేశ్‌లో కియా మోటార్స్ కంపెనీ కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. అనంతపురంలో నెలకొల్పిన ప్లాంట్ నుంచి పెద్ద ఎత్తున కార్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు అనంతపురం ప్లాంట్ నుంచి 5 లక్షల కార్లను ఉత్పత్తి చేసినట్టు కంపెనీ యాజమాన్యం తెలియజేసింది. ఇందులో నాలుగు లక్షల కార్ల దేశీయ మార్కెట్లోకి విడుదల చేయగా, లక్ష కార్లను విదేశాలకు ఎగుమతి చేసినట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రపంచంలోని 91 దేశాలకు కియా కార్లను ఉత్పత్తి చేస్తున్నట్టు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా వినియోగిస్తున్న యుటిలిటీ కార్లలో కియా కంపెనీదే అగ్రస్థానం అని, భారత్ మార్కెట్లో 25 శాతం వాట కియా సొంతం చేసుకున్నట్టు యాజమాన్యం తెలియజేసింది. కేవలం రెండున్నరేళ్ల కాలంలోనే కియా సంస్థ ఈ ప్రగతిని సాధించినట్టు ఆ కంపెనీ వర్గాలు తెలియజేశాయి.
Read: Ukraine Crisis: ఉక్రెయిన్ విలీనానికి రష్యా సన్నాహాలు…