దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి మళ్లీ కలవరం సృష్టిస్తోంది. వారం రోజులతో పోలిస్తే నేడు కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24గంటల్లో 11,739 మంది వైరస్ బారినపడగా.. మరో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా బారి నుంచి 10,917మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,27,72,398గా ఉంది. కోలుకున్న వారి శాతం 98.58 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.21 శాతం వద్ద ఉండగా.. డైలీ పాజిటివిటీ రేటు 2.59 శాతంగా ఉంది.
ఇప్పటివరకు మొత్తం 43,389,973మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 5,24,999కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 92,576ల యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో శనివారం 12,72,739 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,97,08,51,580 కోట్లకు చేరింది. మరో 4,53,940 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.