ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త ఫోన్ మోటో జీ42ను వచ్చేవారం ఇండియాలో లాంచ్ చేయనుంది. ఈ నెల ప్రారంభంలో ఈ ఫోన్ బ్రెజిల్‌లో లాంచ్ చేయబడింది. మోటొరోలా నుంచి రెండు కొత్త ఫోన్‌లు త్వరలో ఆసియా, యూరప్, లాటిన్ అమెరికాలతో పాటు ఎంపిక చేసిన కొన్ని మార్కెట్‌లకు అందుబాటులోకి వస్తాయని ఆ సమయంలో ధృవీకరించింది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ పనిచేయనుంది. ఇంకా మొత్తం ఫీచర్లు వెల్లడించనప్పటికీ.. బ్రెజిల్‌లో ప్రారంభమైన మోడల్‌తో సమానంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ ఫోన్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. మోటో జీ42 వచ్చే వారం భారతదేశంలో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ట్వీట్ చేశారు. అయితే ఖచ్చితమైన లాంచ్ తేదీని వెల్లడించలేదు.
ఫీచర్లు ఇలా..: ఇది ట్రిపుల్ రియర్ కెమెరాలతో వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంటుంది. మోటో జీ42 ఏప్రిల్‌లో మనదేశంలో లాంచ్ అయిన మోటో జీ52 వాటర్-డౌన్ వేరియంట్‌గా వస్తోంది. 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది అడ్రినో 610 జీపీయూతో ఈ ప్రాసెసర్ పెయిర్ అయి ఉంది. మోటో జీ42 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, 8మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్, 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 3జీబీ, 4జీబీ ర్యామ్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మోటీ జీ42 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది.32 జీబీ, 64జీబీ ఆప్షన్లు కూడా అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000mah గా ఉంది. ఇది 20W టర్బోపవర్ ఛార్జర్ ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ 174.5 గ్రాముల బరువు ఉంటుంది.
సింగిల్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ కోసం బ్రెజిల్‌లో Moto G42 ధర అక్కడి కరెన్సీలో 1,699బీఆర్ఎల్ అంటే ఇండియాలో దాదాపు రూ. 25,900గా ఉండే అవకాశం ఉంది. అయితే భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ ధర గురించి వివరాలు ఇంకా ప్రకటించబడలేదు.