టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ట్విటర్ వేదికగా ప్రధానిపై వ్యంగాస్త్రాలు సంధించారు. ద్రవ్యోల్భవణాన్ని నియంత్రిచలేని ప్రధానిని మీరేమంటారని ప్రశ్నించారు. అంతే కాకుండా దేశంలో చొరబాటును నియంత్రించలేక పోతున్న ఇలాంటి ప్రధానిని మీరేమని పిలుస్తారని నాలుగు ఆప్షన్లను కేటీఆర్ ట్వీటర్ వేదిగా ప్రశ్నించారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా రెండో గ్రామాన్ని నిర్మించిందని, శాటిలైట్ ఫోటోలతో సహా మీడియా ప్రచురించిన కథనాలను కేటీఆర్ ట్వీట్ చేసారు. అయితే.. 2021లొ…
భారత త్రివిధ దళాల్లో ఉన్న ఖాళీలను కేంద్రం ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. త్రివిధ దళాల్లో 1,35,784 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలి ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. అత్యధికంగా ఆర్మీలో 1,16,464 పోస్టులు ఖాళీగా ఉండగా.. నేవీలో 13,537, ఎయిర్ఫోర్స్లో 5,723 ఖాళీలు ఉన్నాయని తెలిపింది.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. భారతదేశంలో 200 కోట్ల వ్యాక్సినేషన్లను అందించడంలో మరో మైలురాయిని సాధించినందుకు గానూ అభినందించారు. కొవిడ్ ప్రభావాన్ని తగ్గించినందుకు భారతీయ వ్యాక్సిన్ తయారీదారులు, ప్రభుత్వంతో కొనసాగుతున్న భాగస్వామ్యానికి బిల్గేట్స్ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు.
అమెరికాలోని యుజీన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత లాంగ్ జంప్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ నిరాశ పరిచాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరిన భారత తొలి మేల్ లాంగ్ జంపర్గా చరిత్ర సృష్టించిన శ్రీ శంకర్ ఫైనల్గా పతకం మాత్రం అందుకోలేకపోయాడు. పురుషుల లాంగ్ జంప్ ఫైనల్లో శ్రీశంకర్ ఏడో స్థానంతో సరిపెట్టాడు. కనీసం క్వాలిఫికేషన్ రౌండ్లో అందుకున్న దూరాన్ని కూడా ఫైనల్లో అతడు చేరుకోలేకపోయాడు. ఫైనల్లో అన్ని ప్రయత్నాల్లో అత్యధికంగా 7.96…
ప్రపంచవ్యాప్తంగా కండోమ్ వినియోగం పెరుగుతున్నట్లు గ్లోబల్ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ప్రజల్లో లైంగిక వ్యాధుల పట్ల పెరుగుతున్న అవగాహన, ఇ- కామర్స్ ఫ్లాట్ఫామ్ల అభివృద్ధి కారణంగా కండోమ్ వాడకం పెరిగినట్లు ఆ నివేదికలో పేర్కొంది.
వరదలు, భారీ వర్షాలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అస్సాం రాష్ట్రాన్ని జపనీస్ ఎన్సెఫాలిటిస్ ( జేఈ ) వ్యాధి కలవరపెడుతోంది. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి మనుషుల్లో తీవ్రమైన మెదడు వాపుకు కారణం అవుతుంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పితో బాధితులు బాధపడుతుంటారు. సరైన సమయంలో వైద్యం అందకపోతే వ్యాధి చికిత్సకు లొంగే పరిస్థితి ఉండదు. తాజాగా ఈ వ్యాధి అస్సాం రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులకు కారణం అవుతోంది. ఇప్పటి వరకు జపనీస్ ఎన్సెఫాలిటిస్ వ్యాధి కారణంగా 15…
ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య 20 వేలను దాటుతోంది. వరుసగా మూడో రోజు దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 20 వేలకు పైగానే నమోదు అయింది. దీంతో పాటు మరనణాల సంఖ్య, రికవరీల సంఖ్య కూడా పెరిగింది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, కేరళ వంటి కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరిగింది. అయితే కొన్ని సార్లు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే ఇది సెకండ్ వేవ్ లో పోల్చితే…
తరుచూ మనం అవయవదానం గొప్పతనం గురించి చెబుతుంటాం. అవయవాలను దానం చేయడం వల్ల మరికొంత మందికి పునర్జన్మ ప్రసాదించే అవకాశం ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే.. అవయవదానం గొప్పతనం తెలిసేలా చేసింది. పూణేలో ఓ యువతి అవయవదానం చేయడం వల్ల మరో ఐదుగురికి పునర్జన్మ లభించింది. ఇందులో ఇద్దరు ఆర్మీ సైనికులు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే పూణేకు చెందిన ఓ యువతి ఇటీవల ఓ ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయింది. ప్రమాదానికి గురైన యువతని పూణేలోని…