దేశంలో కోవిడ్ కల్లోలం కొనసాగుతోంది.ఇన్నాళ్లు 20 వేలకు లోపు నమోదు అవుతూ వచ్చిన కేసుల సంఖ్య తాజాగా 20 వేలను దాటింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మహారాష్ట్రతో పాటు వెస్ట్ బెంగాల్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 20,139 కేసులు నమోదు అయ్యాయి. 38 మంది కోవిడ్ బారినపడి మరణించారు. 16,482…
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీస్ సయీద్ కు చెందిన ఉగ్రసంస్థ జామాత్- ఉద్- దావా ( జేడీయూ)కు చెందిన ఇద్దరు సభ్యులను ప్రత్యర్థి గ్రూప్ కాల్చి చంపింది. ఈ ఘటన పాకిస్తాన్ లో కలకలం రేపింది. లాహోర్ కు 130 కిలోమీటర్ల దూరంలోని ఫైసలాబాద్ జరన్ వాలా చక్ 97 జిల్లాలో ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. జేడీయూకు చెందిన రషీద్ అలీ, షాహిద్ ఫరూఖ్ ఇద్దరు ఈద్ అల్ అదా ప్రార్థనలు ముగించుకుని వస్తుండగా..…
ఆకాశంలో అద్బుతం చోటు చేసుకోనుంది. ఈ ఏడాది మరోసారి చంద్రుడు భూమి దగ్గరగా రానున్నాడు. దీంతో సూపర్ మూన్ ఏర్పడబోతోంది. 2022లో మొత్తం నాలుగు సార్లు సూపర్ మూన్ కనువిందు చేయనున్నాయి. తాజాగా ఏర్పడుతున్న సూపర్ మూన్ మూడోది. తరువాతి సూపర్ మూన్ ఆగస్టు 12న కనిపించనుంది. పౌర్ణమి రోజు 90 శాతం చంద్రుడు కనిపించిన సందర్భంలో, భూమి చుట్టూ తిరుగుతున్న సమయంలో చంద్రుడు తన కక్ష్యలో భూమికి దగ్గరగా వచ్చే సమయాల్లో ఈ సూపర్ మూన్…
నిత్యావసరాల ధరల పెరుగుదల సామాన్యుడిపై భారాన్ని మోపుతున్నాయి. ఇప్పటికే పెరిగిన పెట్రోల్ రేట్లు పరోక్షంగా నిత్యావసరాల ధరల పెరుగుదలకు కారణం అవుతోంది. దీంతో పేదలు, మధ్య తరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అయితే వచ్చే వారం నుంచి మరిన్ని నిత్యావసరాల ధరలు పెరుగనున్నట్లు తెలిసింది. తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న నిర్ణయంతో జూలై 18 తరువాత నుంచి పలు నిత్యావసర వస్తువుల ధరలు పెరగబోతున్నట్లు సమాచారం. దీంతో మరింతగా సామాన్యుడిపై భారం పడబోతోంది.…
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా 15 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, బెంగాల్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా మహమ్మారి పూర్తిగా పోలేదని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. తెలంగాణలో కూడా రోజూ 500 పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,906 కేసులు నమోదు అయ్యాయి. మరణాల సంఖ్య…
శ్రీలంకలో అధ్యక్షుగు గొటబయ రాజపక్స మాల్దీవులకు పారిపోయాడు. తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న ద్వీపదేశంలో శనివారం నుంచి మళ్లీ ఉవ్వెత్తున ఆందోళను ఎగిసిపడ్డాయి. దీంతో గొటబయ రాజపక్స అధ్యక్ష భవనాన్ని వదిలి పరార్ అయ్యారు. తాజాగా ఆయన తన భార్య, ఇద్దరు బాడీగార్డులతో మాల్దీవులకు చేరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడో వార్త భారత్ ను ఆందోళనకు గురిచేసింది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశాన్ని వదిలిపోవడానికి భారత్ సహకరించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడి మీడియా ఈ…
As many as eight people have died after a wall collapsed due to incessant rain in Gujarat. Thousands of people have been affected by the flood-like situation in the states gujaraj and maharashtra.