మందు తాగటం మంచి అలవాటు కాదంటారు. కానీ 40 ఏళ్ల వయసు దాటినవారు స్వల్పంగా ఆల్కహాల్ తీసుకోవటం ఆరోగ్యానికి లాభిస్తుందని లాన్సెట్ స్టడీ తెలిపింది. రెడ్ వైన్‌ని రెండు, మూడు పెగ్గులేస్తే గుండె జబ్బులు, గుండెపోటు, షుగర్ లెవల్స్ వంటి హెల్త్ రిస్కులు తగ్గుతాయని పేర్కొంది. 39 ఏళ్ల లోపువారు మందుకొడితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనమూ ఉండదని, పైగా అనారోగ్యానికి గురవుతారని హెచ్చరించింది. మన దేశంలో గత 30 ఏళ్లలో ఆల్కహాల్ వినియోగం కొంచెం పెరిగినట్లు వెల్లడించింది.…
ఇన్నాళ్లు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తాజాగా ఇండియాలో తొలిసారిగా మంకీపాక్స్ కేసు నమోదు అయింది. కేరళ తిరువనంతపురానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తి ఇటీవల యూఏఈ నుంచి స్వదేశానికి వచ్చాడు. అయితే అతనికి మంకీపాక్స్ సంబంధిత లక్షణాలు ఉండటంతో శాంపిళ్లను పూణెలోని నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్కు పంపించగా.. మంకీపాక్స్ అని తేలింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. తాజాగా మంకీపాక్స్ పై కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ…
ప్రపంచీకరణ తర్వాత యువకుల్లో కెరీరిజం పెరిగింది. ధర్నాలు, ఆందోళనలు తగ్గిపోయాయి. రాజకీయ భావజాలం అంతరించిపోతోంది. ఇది చాలా మంది అభిప్రాయం. అయితే ఇది పూర్తిగా నిజం కాదని శ్రీలంక నిరూపించింది. పాలకులంతా శ్రీలంక నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే.. ప్రజలు మంచి వాళ్లే. అయితే అతి పేదరికం ఆకలిలోకి నెడితే మాత్రం వెంటపడి తరుముతారు. శ్రీలంకలో జరుగుతున్నది ఇదే. దీనికి పరిష్కారం కూడా అంత సులభం కాదు. కొత్తగా ఎవరొచ్చినా చేయగలిగింది ఏమీ లేదు. అప్పులిచ్చిన సంస్థలన్నీ…
ఒకప్పుడు వయసుకి వస్తే చాలు.. మాకు పెళ్లెప్పుడు మొర్రో అని యువత మొత్తుకునేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మాకు పెళ్లొద్దు మొర్రో అని కేకలు పెడుతున్నారు. పెళ్లంటేనే ఆమడ దూరంలో ఉంటున్నారు. అసలు పెళ్లి గురించి మాట్లాడటం కాదు కదా, కనీసం ఆ ఆలోచన చేయడానికే పెద్దగా ఆసక్తి చూపడం లేదట! చదువు, ఉద్యోగాలు, వృత్తులు వంటి వ్యాపకాలపై ఎక్కువగా దృష్టి పెడుతుండటం వల్లే మన దేశంలో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య గణనీయంగా…
దేశంలో కరోనా కేసులు తీవ్రత పెరుగుతోంది. వరసగా ఇటీవల కాలంలో 15 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గత రెండు నెలల కాలం నుంచి రోజూవారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కేసులు తీవ్రత అధికంగా ఉంటోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఢిల్లీల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 20,038 కేసులు నమోదు అయ్యాయి. వరసగా రెండు రోజులుగా 20 వేల…
1985 ఎయిర్ఇండియా ఫ్లైట్ బాంబ్ దాడిలో ఆరోపణలు ఎదుర్కొని, ప్రధాన నిందితుడనే ఆరోపణలు ఉన్న రిపుదమన్ సింగ్ మాలిక్ దారుణ హత్యకు గురయ్యారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా సర్రే ప్రాంతంలో ఆయన్న దుండగుడు కాల్చిచంపాడు. ఈ విషయాన్ని రిపుదమన్ సింగ్ కొడుకు జస్ప్రీత్ మాలిక్ ధ్రువీకరించారు. ఎయిర్ఇండియా బాంబు దాడిలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిగా మా తండ్రిని ఎప్పడూ మీడియా సూచిస్తుందని.. తన తండ్రిపై జరిగిన దాడితో దానికి సంబంధి లేదని ఆయన సోషల్ మీడియా వేదికగా…
అమెరికా విధానాలకు వ్యతిరేకంగా లావాదేవీలు నిర్వహించే దేశాలపై విధించే కాట్సా(సీఏఏటీఎస్ఏ) చట్టం నుంచి భారత్ కు మినహాయింపు లభించే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఈ చట్టం నుంచి భారత్ ను మినహాయిస్తూ యూఎస్ ప్రతినిధుల సభ తీర్మాణాన్ని గురువారం ఆమోదించింది. ధీంతో రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని.. ఇది చైనా దురాక్రమనను అరికట్టడంతో ఉపయోగపడుతుందని అమెరికా చట్ట సభ ప్రతినిధులు భావిస్తున్నారు. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్డీఏఏ) సవరణల ప్రకారం.. భారతీయ-అమెరికన్,…
ఇండియాలో మరోసారి మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదు అయింది. ఇటీవల బ్రిటన్ నుంచి పశ్చిమ బెంగాల్ కు వచ్చిన మిడ్నాపూర్ వాసికి ఒళ్లంతా దద్దర్లతో కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో చేరడం ఆందోళన పెంచింది. అయితే తాజాగా మరో అనుమానిత కేసు కేరళలో నమోదు అయింది. గతంలో కూడా నిఫా, కరోనా వంటి కేసులు ముందుగా కేరళలోనే బయటపడ్డాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి ఇటీవల కేరళలోకి వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు…
లింగ సమానత్వ సూచీలో ఇండియా పూర్ ఫెర్ఫామెన్స్ కనబరిచింది. చివరి వరసలో నిలిచింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం లింగ సమానత్వ సూచీ 2022( జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2022)లో పొరుగు దేశాల కన్నా వెనకబడి ఉంది. మొత్తం 146 దేశాల్లో భారత్ 135వ స్థానంలో నిలిచింది. మన తర్వాత మరో 11 దేశాలు మాత్రమే ఉన్నాయి. మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ (71), నేపాల్ (96), శ్రీలంక(110), మాల్దీవులు (117), భూటాన్ (126) కన్నా ఇండియా వెనకబడి…
దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ తీరంతో పాటు మధ్య భారతంలోని ప్రాంతాల్లో వర్ష తీవ్రత అధికంగా ఉంది. ఈ రోజు 8 రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. 22 నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సాధారణం కన్నా అధికంగా వరద పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, తెలంగాణ, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్‌లలోని 31 డ్యామ్‌లకు వరద…